ETV Bharat / state

తెలంగాణ సర్కార్​కు షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ

NGT
NGT
author img

By

Published : Dec 22, 2022, 12:23 PM IST

Updated : Dec 22, 2022, 12:52 PM IST

12:19 December 22

రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా విధించిన ఎన్జీటీ

NGT imposed fine on Telangana Govt: పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి.. జాతీయహరిత ట్రైబ్యునల్‌ చెన్నై బెంచ్‌ భారీ జరిమానా విధించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం అంటే సుమారు రూ. 900 కోట్ల వరకు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. పర్యావరణం సహా అనేక అనుమతులు లేవని ప్రాజెక్టు నిర్మాణాలు నిలుపుదల చేయాలంటూ.. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదని ఎన్జీటీలో.. వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై కర్నూలుకి చెందిన చంద్రమౌలేశ్వర్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై చెన్నై బెంచ్‌ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ అమలుచేస్తున్నట్లు తీర్పులో ఎన్జీటీ చెన్నై పేర్కొంది.

ఇవీ చదవండి: రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి.. బీజేపీ నేతలకు కేటీఆర్ ప్రశ్న

చేపలు పట్టడంలో శిబు స్టైలే వేరు.. సముద్రంలోకి డైవ్ చేసి బల్లెంతో వేట

Last Updated : Dec 22, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.