ETV Bharat / state

ఎలా కట్టడి చేద్దాం... సీఎస్​ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కట్టడి వ్యూహాన్ని ప్రభుత్వం నేడో, రేపో ఖరారు చేయనుంది. లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదన నేపథ్యంలో అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజూ చర్చలు జరిపారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అందించే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అటు... కరోనా నిర్ధరణ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూసే అంశంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది.

author img

By

Published : Jul 2, 2020, 4:46 AM IST

implementation of lock down in Hyderabad
ఎలా కట్టడి చేద్దాం... సీఎస్​ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీలో కేసుల తీవ్రత దృష్ట్యా 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, నిపుణులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై విస్తృతస్థాయిలో చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించాలా...? లేదా..? అనే విషయమై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రయోజనాలు ఏమిటి?, నష్టాలు ఏమిటి

లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ప్రయోజనాలతోపాటు.. విధించకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై చర్చించడంతోపాటు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాలు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు, విధించకపోతే అమలు చేయాల్సిన ప్రత్యామ్నాయాలపై ఆరా తీస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. మరోవైపు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌... కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు సహా సంబంధించి అంశాలపై అధికారులతో సమాలోచలు చేసి నివేదిక రూపొందించారు. గురువారం ఈ నివేదిక సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారని సమాచారం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, నిపుణుల సూచనలకు అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ సహా జీహెచ్ఎంసీ, రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి నేడో, రేపో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

కరోనా నిర్ధరణ పరీక్షల విషయమై సర్కారు దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల పరీక్షల సంఖ్య పెరిగింది. అయితే ఫలితాలకు సమయం బాగా తీసుకుంటోంది. సేకరించిన నమునాలన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చి అక్కడి నుంచి వాటిని ప్రయోగశాలలకు తరలిస్తున్నారు. ఇతర కారణాల వల్ల ఫలితాలకు ఎక్కువ సమయం తీసుకుంటోందని అధికారులు గుర్తించారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చూడాలని... ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.