ETV Bharat / state

msp for kharif crops 2021: మార్కెటింగ్ సీజన్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మద్దతు ధరలు ఇవే! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో వానాకాలం మార్కెటింగ్ సీజన్‌పై(kharif marketing season 2021)సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం ముగిసిన నేపథ్యంలో మార్కెట్‌కు రాబోయే పంట ఉత్పత్తుల కొనుగోలుపై కసరత్తు చేస్తోంది. యాసంగి సీజన్‌ ప్రారంభమైన తరుణంలో ప్రధాన ఆహార వరి, పత్తి పంట కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ధాన్యం, పత్తి పంటలు సంబంధించి నాణ్యతా ప్రమాణాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా పంట ఉత్పత్తులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా రైతులు తమ పంటలకు మద్దతు ధరలు(msp for kharif crops 2021) పొందుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు.

msp for kharif crops 2021, kharif marketing season 2021
ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు, ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021
author img

By

Published : Oct 2, 2021, 4:11 PM IST

రాష్ట్రంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(kharif marketing season 2021) ఆరంభం కాబోతోంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులకు ప్రధాన వాణిజ్య పంట పత్తి సరకు వస్తుండగా... ధాన్యం సేకరణపై(msp for kharif crops 2021) ప్రభుత్వం, భారత పత్తి సంస్థ- సీసీఐ సన్నాహాలు చేస్తుంది. 46.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు అయిన పత్తి పంట... దాదాపు 60 లక్షల పత్తి బేళ్లు మార్కెట్‌కు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను సైతం సిద్ధం చేసింది. 61.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంపై పౌరసరఫరాల శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది(telangana government about minimum selling price). ఇవి దృష్టిలో పెట్టుకుని ధాన్యం, పత్తి పంట ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

తేమ శాతం ఇలా..

శాసనసభ ఆవరణలో తన ఛాంబర్‌లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(minister niranjan reddy about msp) చేతుల మీదుగా ఆవిష్కరించారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండాలి. తేమ శాతం 8కి లోబడి ఆరు, ఏడు శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ధర లభిస్తుంది. తేమశాతాన్ని బట్టి కింది విధంగా ధరలు కేటాయించినట్లు సీసీఐ, మార్కెటింగ్ శాఖ ప్రకటించింది.

తేమశాతం పొడవు పింజ మద్దతు ధర పింజరకం మద్దతు ధర
6రూ.6,025+120.50 రూ.5,925+118.50
7రూ.6,025+60.25 రూ.5,925+59.25
8 రూ.6,025 రూ.5,925
9రూ.5,964.75 రూ.5,865.75
10 రూ.5,904.50 రూ.5,806.50
11 ధర రూ.5,844.25 రూ.5,747.25
12ధర రూ.5,784 రూ.5,688

సమన్వయంతో...

ప్రధాన ఆహార పంట వరి ధాన్యం సాధారణ రకం క్వింటాకు మద్దతు ధర రూ.1940 కాగా... ఏ గ్రేడ్ రకానికి రూ.1960 చొప్పున రైతులకు చెల్లించనున్నారు. ఈసారి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్‌కు పోటెత్తనున్న దృష్ట్యా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ పంటలకు కింది విధంగా మద్దతు ధరలు(msp for kharif crops 2021) ప్రకటించింది.

ధరలు వివరాలు ఇలా..

పంటలు క్వింటాకు మద్దతు ధర
వరిరూ.1,940(ఏ గ్రేడ్​కు రూ.1960)
కందులు రూ.6,300
పెసర రూ.7,275
వేరుశెనగరూ.5550
మినుములురూ.6,300
పొద్దుతిరుగుడురూ.6,015
నువ్వులురూ.7,307
జొన్నలు రూ.2,738-2,758
సజ్జలురూ.2,250
రాగులు రూ.3,377

రెక్కల కష్టానికి తగిన ఫలితం

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు తక్షణం అందుబాటులోకి వస్తాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటలు శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్యాడి క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని అన్నారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందనడానికి నీతి అయోగ్‌ తాజా నివేదికనే సాక్ష్యమని అన్నారు. 6.59 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని... పెద్దరాష్ట్రాల్లో తెలంగాణ 1వ స్థానంలో ఉందని... రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.

రికార్డులు బ్రేక్

రాష్ట్రంలో సాగు నీటి సదుపాయాల కల్పన, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా, రైతుబంధు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల విధానాల నేపథ్యంలో పంటల ఉత్పత్తిలో ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సైతం అదే జరగబోతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి: road problems in villages: హెచ్చరిక... ఆ రహదారిపై ప్రయాణం.. ప్రమాదం.. నరకప్రాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.