ETV Bharat / state

Land Values in TS: శరవేగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూవిలువల పెంపు ప్రక్రియ - ts news

Land Values in TS: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర విలువల పెంపు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వివరాలను విలువల పెంపు కమిటీలకు చేరవేశారు. వ్యవసాయ భూముల విలువలతోపాటు అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాల విలువలు మూడు స్లాబుల్లో పెంచేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Land Values in TS: శరవేగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూవిలువల పెంపు ప్రక్రియ

author img

By

Published : Jan 28, 2022, 4:07 AM IST

Land Values in TS: శరవేగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూవిలువల పెంపు ప్రక్రియ

Land Values in TS: రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచనున్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను కమిటీల ఆమోదానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లాలకు పంపించింది. గురువారం జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ శేషాద్రి... విలువల పెంపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు చెందిన వివరాలను స్వయంగా ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు తీసుకెళ్లారు. బహిరంగ మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ విలువలను ఆధారం చేసుకుని సగటున అపార్టమెంట్లకు 25శాతం, ఖాళీ స్థలాలకు 35శాతం, వ్యవసాయ భూములకు 50శాతం పెంచుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టం చేసింది. కానీ ఆయా ప్రాంతాల ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని కూడా విలువల నిర్దారణ ఉంటుందని వెల్లడించింది. సవరించిన మార్కెట్​ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది.

మార్కెట్​ విలువలను బట్టి..

రాష్ట్రం మొత్తం మీద 500 నుంచి 600 గ్రామాలు పొటెన్షియాలిటీ కలిగినవిగా అధికారులు గుర్తించారు. వందల సంఖ్యలో పట్టణాలు, పదుల సంఖ్యలో నగరాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూముల విలువల పెంపునకు సంబంధించి 50శాతం అని చెబుతున్నా... బహిరంగ మార్కెట్‌ విలువలను బట్టి ఆయా ప్రాంతాల్లో మరో రెండు స్లాబులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖాళీ స్థలాలపై 35శాతం విలువలు పెంచుతున్నా.. ప్రాధాన్యత ప్రాంతాల ఆధారంగా అంతకంటే తక్కువ, ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ల విషయంలో చదరపు అడుగు 4వేలకు మించి రిజిస్ట్రేషన్‌ విలువలు ఉన్నట్లు నిర్దేశించినా.. 25శాతం స్లాబు కంటే తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా ప్రతి విభాగంలో మూడు స్లాబులు ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

నేడు, రేపు కమిటీల ఆమోదం

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో నేడు ఆ శాఖ కమిషనర్‌ శేషాద్రి సమావేశం కానున్నారు. ఈ మూడు జిల్లాలు రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యత కలిగినవి కావడం... విలువల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 60శాతానికిపైగా ఇక్కడి నుంచే రానున్నందున ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 29నాటికి విలువలు పెంపు కమిటీల ఆమోదం కోసం ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడు, రేపు విలువల కమిటీలు సమావేశమై... స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రతిపాదించిన విలువలను పరిశీలించి ఆమోదం తెలపనున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.