ETV Bharat / state

TS: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు!

రాష్ట్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలనూ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

TS: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు!
TS: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు!
author img

By

Published : Jun 10, 2021, 4:28 AM IST

రాష్ట్రంలో ఇంటర్మీడియట్​ రెండో సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వారం రోజుల క్రితం ప్రకటించగా.. అదే బాటలో రాష్ట్రం నడిచింది. రద్దు విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మార్కులు ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయమై విధి విధానాలు రూపొందించేందుకు అధికారులతో కమిటీని నియమించామని, రెండు మూడు రోజుల్లో నివేదిక అందుతుందని, అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కేటాయించిన మార్కులు సరిపోవనుకున్న వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

పలు సంఘాల హర్షం
పరీక్షల రద్దు నిర్ణయంపై పలు సంఘాలు హర్షం ప్రకటించాయి. విద్యార్థుల భయాందోళనను పోగొట్టేలా సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణకుమార్‌, ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం జాదవ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌.రామారావు, ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్లు రామకృష్ణగౌడ్‌, కొప్పిశెట్టి సురేష్‌, గాదె వెంకన్న తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. 4.73 లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలిగించారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ చెప్పారు.

ఇవీ ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు
* తొలి ఏడాదిలో సాధించిన మార్కులే రెండో సంవత్సరం కూడా ఇస్తారు. ఇంటర్‌బోర్డు నెలన్నర క్రితమే ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన సమర్పించింది.
* గత ఏడాది ప్రథమ సంవత్సరం తప్పినవారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరపనందున కనీస మార్కులతో వారిని ఉత్తీర్ణులను చేశారు. వారికి ఇప్పుడు 45 శాతం మార్కులు కేటాయించే అవకాశం ఉంది. 35 శాతం మార్కులతో పాసైన వారికీ 45 శాతం ఇస్తారు. దానివల్ల భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలన్నా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
* సైన్స్‌ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు కూడా రద్దయినట్లే. వారు రాసిన రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్‌ మార్కులు కేటాయిస్తారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ వార్షిక పరీక్షలకు 4,73,967 మంది ఫీజు చెల్లించారు. వారందరినీ ఉత్తీర్ణులను చేయనున్నారు.

ఇదీ చూడండి: విశ్వవిద్యాలయాలు విశిష్ట నిలయాలుగా ఎదగాలి: గవర్నర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.