ఈనెల 28 నుంచి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు కూడా తెలంగాణకు వచ్చేందుకు అనుమతులు లభించాయి. బెంగళూరుకు బస్సు సర్వీసులకు మాత్రం ప్రభుత్వం అనుమతివ్వనివ్వలేదు.
ఆ రాష్ట్రాలకు చెందిన రాయచూర్, బీదర్, గుల్బర్గా, నాందేడ్, ముంబయి, పుణే, నాగ్‌పుర్, చంద్రాపుర్ మార్గాల్లో టీఎస్ఆర్టీసీ బస్సులు తిప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు.