కరోనా ఆపత్కాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన జానపద కళాకారులకు చేయూతనందించారు. జానపద కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండలరావు ఆధ్వర్యంలో 100 మంది జానపద కళాకారులకు వేయి రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఉపాధి కోల్పోయిన జానపద కళాకారుల కష్టాలను గుర్తించిన సంఘం వారికి సాయం చేయడం అభినందనీయమని రమణాచారి అన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు చెందిన 100 మంది కళాకారులు ఈ సాయంతో లబ్ధి చెందారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి: కొవిడ్ విలయం: కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు