ETV Bharat / state

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్‌రన్నర్ జాబితాలో తెలంగాణ - ఆర్థిక సర్వే 2022

Sustainable Development Goals: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రం ఫ్రంట్ రన్నర్ జాబితాలో నిలిచింది. 75 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో ఉండగా... 69 పాయింట్లతో గుజరాత్‌తో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. జాతీయ సగటైన 66 పాయింట్ల కన్నా కాస్తా మెరుగైన స్థానంలో ఉన్నట్లు.. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంధనం విషయంలో వంద పాయింట్లు సాధించిన తెలంగాణ.. సురక్షిత తాగునీరు, పారిశుధ్యం విషయంలో 96 పాయింట్లు సాధించింది.

Telangana
Telangana
author img

By

Published : Feb 1, 2022, 6:27 AM IST

Sustainable Development Goals: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పురోగతిని కూడా వివరించింది. రాష్ట్రాల వారీగా ఆయా లక్ష్యాల సాధనలో ప్రస్తుత స్థితిని స్పష్టం చేసింది. 75 స్థానాలతో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 15 రాష్ట్రాలు 65కు పైగా పాయింట్లు సాధించి ఫ్రంట్ రన్నర్ జాబితాలో నిలిచాయి. 69 పాయింట్లతో తెలంగాణ, గుజరాత్‌ సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాయి. జాతీయ సగటు 66 పాయింట్లు కంటే తెలంగాణ 3 పాయింట్లు అధికంగా సాధించింది.

వందకు వంద పాయింట్లు..

మొత్తం 15 లక్ష్యాలకు గాను ఒక్క దానిలో మాత్రమే రాష్ట్రం.. వందకు వంద పాయింట్లు సాధించింది. అఫార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో చేరుకుంది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం విషయంలో 96 పాయింట్లు సాధించింది. భూమిపై జీవనానికి సంబంధించి 81 పాయింట్లు వచ్చాయి. 65కు పైగా పాయింట్లతో తొమ్మిది లక్ష్యాల విషయంలో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న తెలంగాణ.. 50 పైగా పాయింట్లతో మూడు లక్ష్యాలకు సంబంధించి పర్ఫార్మర్‌ జాబితాలో నిలిచింది. రెండు లక్ష్యాల్లో మాత్రం 50 కంటే తక్కువ పాయింట్లు సాధించి ఆస్పిరెంట్ జాబితాలో ఉంది. వాతావరణ చర్యలు, లింగ సమానత్వం విషయంలో కేవలం 43, 41 పాయింట్లు మాత్రమే సాధించింది.

ఎనిమిది లక్ష్యాల్లో జాతీయ సగటును అధిగమించిన తెలంగాణ... ఒక దానిలో మాత్రం సమానంగా నిలిచింది. మిగిలిన ఐదు లక్ష్యాల సాధనలో జాతీయ సగటు కంటే తక్కువ పాయింట్లు సాధించింది. 2011 నుంచి 2021 వరకు దశాబ్ద కాలంలో హైదరాబాద్‌లో అటవీవిస్తీర్ణం భారీగా పెరిగినట్లు ఆర్థికసర్వే తెలిపింది. 2011లో ఉన్న అటవీవిస్తీర్ణం 33.2 చదరపు కిలోమీటర్లు కాగా... 2021 వరకు అది 81.8 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్లు వివరించింది. పదేళ్ల కాలంలో 146.8శాతం పెరుగుదల ఉన్నట్లు తేల్చింది.

కొవిడ్ మొదటి విడతలో దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే రెండో వేవ్‌లో మాత్రం భారీగా పెరిగాయి. మొదటి దఫాలో ఇళ్ల విక్రయాల్లో 37.6 శాతం తరుగుదల నమోదు కాగా... రెండో విడతలో 37.9 శాతం పెరుగుదల ఉంది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు కొవిడ్ మొదటి విడత సమయంలో 12.3 శాతం పెరుగుదల ఉంటే రెండో దఫా సమయంలో అది 21.3 శాతంగా నమోదైంది. వంద శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీరిచ్చే పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మాత్రమే ఉన్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది.

ఇదీచూడండి: Hyderabad Real Estate: హైదరాబాద్​లో కళ్లు తిరిగేలా పెరుగుతున్న ఇళ్ల ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.