రాష్ట్రంలో చేపట్టిన మూషిక, జింకల పునరుత్పత్తి, సంరక్షణ చర్యలు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. వీటితో పాటు అటవీశాఖ చేపట్టిన వినూత్న ప్రయత్నాలను కూడా వేదికపై ప్రస్తావించారు.
అంతరించే దశలో...
అంతరించిపోయే దశకు చేరుకున్న మూషిక, జింకలను నెహ్రూ జూ పార్క్ వేదికగా పునరుత్పత్తి చేపడుతూ వాటి సంరక్షణ చర్యలను ప్రత్యేకంగా వివరించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ అటవీ ప్రాంతంలో రాబందుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం అంశాలను సైతం తెలియజేశారు. జాతీయ, అంతర్జాతీయంగా విజయవంతమైన 73 అటవీ శాఖ కార్యక్రమాలను సదస్సులో ప్రస్తావించారు. వాటిల్లో మూషిక జింకల పునరుద్ధరణ అంశం ప్రశంసలు అందుకొంది.
ఇవీ చూడండి : సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రజత్‌కుమార్