ETV Bharat / state

ఇటు చినుకుపై ఆశ.. అటు సబ్సిడీకై ఎదురుచూపు - telangana rains

ఏరువాక పున్నమి దాటినా తొలకరి చినుకు జాడలేదు. అరకొరగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు విత్తనాలు చల్లినా వేడికి సరిగా మొలకరాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రుతుపవన వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

telangana farmers are waiting for rain for the cultivation in kharif
చినుకు కోసం ఎదురుచూపులు
author img

By

Published : Jun 8, 2020, 10:11 AM IST

జూన్‌ తొలివారం గడచిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించవచ్చనేది వాతావరణశాఖ అంచనా. ఈసారి పత్తి, వరి, కంది పంటలే కోటీ 20లక్షల ఎకరాల్లో వేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 4లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయాలని, ఈ విత్తనాలకు రాయితీ ఇస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. కానీ అవి మార్కెట్‌లో దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.

కంది, సోయా విత్తనాలకు పల్లెల్లో గిరాకీ పెరిగింది. వీటిలో పత్తి, వరి, కంది పంటల విత్తనాలకూ రాయితీలేమీ ఇవ్వడం లేదని రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనేందుకు బారులు తీరుతున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సైతం పూర్తి ధరలకే విత్తనాలు విక్రయిస్తోంది. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయనందున బ్యాంకులు పంటరుణాల పంపిణీని పూర్తిస్థాయిలో మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో పంట పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రైతుబంధు సొమ్ము కోసం రైతులు వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

రైతుబంధు సొమ్మిస్తే ఆసరాగా ఉంటుంది

నాకు ఐదెకరాల భూమి ఉంది. రాళ్లనేల కావడంతో ఎద్దులతో దున్నడం కష్టమని ట్రాక్టరు పెట్టడంతో ఎక్కువ ఖర్చయింది. ఈసారి పత్తి, సోయా, కంది వేస్తాను. ఇప్పటికే పత్తి విత్తనాలు కొన్నాను. సోయా విత్తులింకా తీసుకోలేదు. వానాకాలం పంట వేయక ముందే రైతుబంధు డబ్బులు అందివుంటే పెట్టుబడులకు ఇబ్బంది తప్పేది. రెండేళ్లుగా పంట దిగుబడి సరిగా రాక బ్యాంకు రుణం చెల్లించలేదు. ఇప్పుడు బ్యాంకు పంటరుణం ఇవ్వకపోవటంతో విత్తనాల కోసం అప్పు చేశాను.

- భీమేశ్‌, పత్తి, సోయా రైతు, తాండ్ర, మామడ మండలం, నిర్మల్‌ జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.