ETV Bharat / state

ఆబ్కారీ శాఖతో.. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం

author img

By

Published : Oct 9, 2020, 10:17 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ.. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ తరువాత అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే వనరుగా మారింది. 2014-15 ఆర్థిక ఏడాదిలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.10,500 కోట్లుకాగా.. 2019-20 నాటికి దాదాపు 22వేల కోట్ల రూపాయల రాబడితో ఆబ్కారీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Telangana excise income is getting double
తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం

తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వానికి రెండో అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. వ్యాట్‌, జీఎస్టీల ద్వారా ఏడాదికి యాభైవేల కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చి పెడుతున్న అతి పెద్ద ఆర్థిక వనరు వాణిజ్య పన్నుల శాఖ. ఏడాదికి ఇరవైవేల కోట్ల రూపాయలకు పైగా రాబడిని తీసుకొచ్చి ఆబ్కారీ శాఖ రెండో స్థానంలో నిలుస్తోంది. 2013-14 ఆర్థిక ఏడాదిలో ఆబ్కారీ శాఖ ఆదాయం రూ. 9,813 కోట్లు కాగా 2019-20 ఆర్థిక ఏడాది నాటికి దాదాపు 22వేల కోట్ల రాబడి ఎక్సైజ్‌ శాఖ నుంచి వచ్చింది.

గుడుంబా కట్టడితో అధిక ఆదాయం

తెలంగాణ సాధించుకున్న తర్వాత.. ఎక్సైజ్‌ శాఖ రాష్ట్రంలో గుడుంబాను కట్టడి చేయడంతో ప్రభుత్వానికి ఒక్కసారిగా రెండు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. మద్యం ధరలు పెంచడం, అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం వంటి చర్యలతో రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ ఆదాయం అంచనాకు మించి పెరుగుతోంది. 2014-15 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో రూ.10,500 కోట్ల ఆదాయం రాగా, 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ.12350 కోట్లు, 2016-17లో రూ.14250 కోట్లు, 2017-18లో రూ.16,092 కోట్లు, 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ.18,244 కోట్ల లెక్కన రాష్ట్రానికి ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఆదాయం చేకూరినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2019-20 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.21, 600 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ఆదాయం వచ్చింది.

పెరుగుతున్న రాబడి

రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, దాదాపు 1400 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు ఉన్నాయి. వీటి నిర్వహణకు లైసెన్సీలు జారీ చేస్తారు. మూడు దఫాల్లో మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వడం, అదనపు ఎక్సైజ్‌ పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి రాబడి క్రమంగా పెరుగుతోంది. 2,216 దుకాణాల ఏర్పాటుకు 2015-17లో లైసెన్స్‌ ఫీజుల ద్వారా రూ.1260 కోట్లు రాగా, 2017-19లో రూ.1360 కోట్లు, 2019-21లో చెంది లైసెన్సుల జారీ, ప్రత్యేక రీటైల్‌ ఎక్సైజ్‌ పన్నుల ద్వారా రూ.1,467 కోట్ల ఆదాయం చేకూరినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

నిబంధనల మార్పుతో పెరిగిన ఆదాయం

మద్యం విధానంలో తెచ్చిన మార్పులతో 2019-20 సంవత్సరానికి రూ.1,438 కోట్ల రాబడి ప్రభుత్వానికి చేకూరింది. ఇప్పటి వరకు బీరుపై లైసెన్స్‌దారులకు ఉన్న 25శాతం మార్జిన్‌ను 20శాతానికి తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు, ప్రతి దుకాణదారుడి నుంచి ప్రత్యేక రీటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ వసూలు ద్వారా రూ.111 కోట్లు, గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు శ్లాబులుగా విస్తరించడం ద్వారా రూ.152 కోట్లు, లైసెన్సీలు ఎక్సైజ్‌ ట్యాక్స్‌ విలువకు ఏడు రెట్లు మించి మద్యం అమ్మినట్లయితే అదనంగా జరిగిన విక్రయాలపై విధించే టర్నోవర్‌ ట్యాక్స్‌ కింద మరో రూ.28 కోట్లు వరకు వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. వెనక్కి తిరిగి ఇవ్వని ఫీజు కింద దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున వసూలు చేయడం వల్ల 2,216 దుకాణాల ఏర్పాటుకు వచ్చిన 48,784 దరఖాస్తుల ద్వారా... రూ.975.68 కోట్ల ఆదాయం వచ్చింది.

వందలో 60రూపాయలు సర్కారుకే

స్థానికంగా తయారయ్యే మద్యంపై 80 నుంచి 90శాతం ఎక్సైజ్‌ డ్యూటీ విధిస్తారు. మద్యం రకాలను బట్టి 190శాతం వరకు విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌ వేస్తారు. విదేశీ మద్యంపై దిగుమతి సుంకం విధిస్తారు. ఇలా వివిధ రకాల ఆదాయం.. ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ఆబ్కారీ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రతి వంద రూపాయల మద్యం సీసాపై.. మద్యం తయారీదారుడికి రూ.20లు, లైసెన్స్‌ దారుడికి రూ.20లు ప్రకారం.. మొత్తం 40 రూపాయలు పోగా.. మిగిలిన రూ.60లు ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌లు విధించడం ద్వారా ప్రభుత్వానికి వస్తోంది.

2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.25వేల కోట్లు

ఇలా రాష్ట్రంలో అమ్ముడు పోయే మద్యం విలువలో 60శాతం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తోంది. మద్యం దుకాణాలకు బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు, పబ్‌లకు, క్లబ్‌లకు అనుమతి ఇవ్వడానికి వసూలు చేసే లైసెన్స్‌ ఫీజు, రీటైల్‌ ట్యాక్స్‌, టర్నోవర్‌ ట్యాక్స్‌ ఇలా వివిధ రకాల పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాను ఆబ్కారీ శాఖ నింపుతోంది. 2020-21 ఆర్థిక ఏడాదిలో ఆబ్కారీ శాఖ ఆదాయం దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.