పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో 8,783 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని పది యూనివర్సిటీ కాలేజీల్లో 783 సీట్లు ఉండగా.. మొదటి విడతలోనే అన్నీ భర్తీ అయిపోయాయి. ప్రైవేట్ కాలేజీల్లో 89.89శాతం సీట్లు కేటాయింపు పూర్తయింది.
ఫార్మసీ వెలవెల
ఫార్మసీ సీట్లకు స్పందన కరవైంది. బీఫార్మసీలో ఈసెట్ అభ్యర్థులకు 1,029 సీట్లు అందుబాటులో ఉండగా... కేవలం 54 భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 7 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 18 నుంచి 21 తర్వాత కాలేజీకి వెళ్లి చేరాలి. ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 13న ప్రారంభం కానుంది. ఈనెల 14న ధ్రువపత్రాల పరిశీలన, 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు ఉంటుంది. ఈనెల 17న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.
ఇదీ చూడండి: TS ECET: ఏపీ ర్యాంకర్లకు ఈసారి తెలంగాణ ఈసెట్ ప్రవేశాలు లేవు