ప్రాజెక్టుల డీపీఆర్‌లను స్క్రూటినీ పేరిట గోదావరి నదీ యాజమాన్య బోర్డు జాప్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. బోర్డుకు ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పిస్తే విభజన చట్టం క్లాజ్ 85(8)(d)లో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ బోర్డు కాలయాపన చేస్తోందని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్లాజ్‌లో పేర్కొన్న అంశాలకు మాత్రమే పరిమితం కావాలన్న తెలంగాణ... మిగతా అంశాలను కేంద్ర జలసంఘంలోని డైరెక్టరేట్లు పరిశీలిస్తాయని పేర్కొంది. డీపీఆర్‌లను పరిశీలించే నిపుణత లేదని రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను గతంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సీడబ్ల్యూసీకి పంపిందని లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో తాము ఇచ్చిన డీపీఆర్‌లను ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని కోరారు.
ఇదీ చూడండి:
Viral Video: నోట్లిస్తేనే ఓట్లేస్తాం.. పైసలు అందలేదని రోడ్డెక్కిన ఓటర్లు.. ఎక్కడంటే..?