ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి బకాయి ఉన్న 2వ డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కోఠిలోని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ముందు సంఘం నాయకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.
ఎన్నికలు ఉన్నాయనే నెపంతో ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని... ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... తమ పట్ల చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని పీఆర్సీ, డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సీబీఐ ఇన్‌స్పెక్టర్ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్