ETV Bharat / state

Telangana Election Campaign in Social Media : ఎన్నికల వేళ సోషల్​ మీడియాకు భారీ డిమాండ్​.. పైసా కొడితే క్షణాల్లో లక్షల మంది ఫాలోవర్లు - ఎన్నికల ప్రచారం కోసం సోషల్​ మీడియా

Telangana Leaders Campaign Through Social Media : మీరు సోషల్​ మీడియాలో ఏదైనా ఛానల్​ ప్రారంభించారా.. మీకు వేలు, లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారా. అయితే ఇక మీపై కాసుల వర్షం కురవడం ఖాయం. అదెలా అనుకుంటున్నారా..? ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారానికి సోషల్​ మీడియాను ఎక్కువ వాడుతున్నారు. మీ దగ్గర ఉన్న ఫాలోవర్​లను వారికి అమ్ముకుంటే చాలు.. లక్షలు, కోట్లల్లో సంపాదించుకోవచ్చు.

Telangana Leaders Campaign Social Media
Telangana Leaders Campaign Through Social Media
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 11:14 AM IST

Telangana Leaders Campaign Through Social Media : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యం(Telangana Election Poll 2023)లో నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పాత పద్ధతులలో ప్రచార సభలకు డబ్బులిస్తే వేల సంఖ్యలో జనం హాజరవ్వడం మామూలే.. కానీ ట్రెండ్​కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఆధునిక ప్రచారానికి నేతలు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సామాజిక మాధ్యమాల(Social Media Campaign) వైపు తొంగి చూస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఆన్​లైన్​ వైపు చూడని నేతలు ఒక్క పోస్టుతో వేలు, లక్షల మందిని చేరుకోవాలంటే.. వ్యక్తిగత ఖాతా తెరిచి పాలోవర్లు పెరిగే వరకు నిరీక్షించాలి. ఇది చాలా కష్టం. ఇలాంటివి ఏవీ లేకుండా పైసా కొడితే చాలు వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను తెచ్చి పెట్టే కొత్త విధానం అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కో ఫాలోవర్​కు రూ.3 నుంచి రూ.5 వరకు ధరను నిర్ణయించి.. లక్షల సంఖ్యలో ఉన్న ఫాలోవర్లు ఉండే సామాజిక మాధ్యమ పేజీలను కొందరు అమ్మేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్​ నగరంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీటికి భలే గిరాకీ ఉందని సోషల్​ మీడియా స్ట్రాటజిస్టులు చెబుతున్నారు.

Apps to Complain about Election Irregularities : ఈ యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోండి.. ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకోండి

ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం : ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు పైచేయి సాధించాలని భావిస్తూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజా సంబంధాలను పెంచుకోవాలనుకుంటారు. మరి కొందరు హోర్డింగులు, ఫ్లెక్సీలు, వార్తాపత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తారు. ఇది అంతా ఒకెత్తు అయితే.. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయిలో అందరికీ చేరువై తటస్థ ఓటర్లను ఆకర్షించడం మరో ఎత్తు. ఇలాంటి ప్రచారానికి రాష్ట్రస్థాయి నేతలే కాదు.. నియోజకవర్గ స్థాయి నాయకులు గురి పెట్టారు. ఎక్కువ ప్రజాదరణ ఉండి.. లక్షల ఫాలోవర్లు ఉండే పేజీలను డబ్బులిచ్చి కొనుగోలు చేసి.. తాత్కాలికంగా సోషల్​ స్ట్రాటజిస్టులను నియమించుకుంటారు.

డబ్బులు లిస్తే కంటెంట్​ రెడీ : మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అందులో ఉండే కంటెంట్​ నచ్చితేనే ఎక్కువ మందిని వాటిని అనుసరిస్తారు. లేకపోతే అసలు వాటి జోలికే వెళ్లరు. ముఖ్యంగా ఈ సోషల్​ మీడియాలో యువతే యాక్టివ్​గా ఉంటున్నారు. చాలా మంది అడ్మిన్లు వర్తమాన రాజకీయాలకు సంబంధించిన పోస్టులు, కార్టూన్​లు, మీమ్​లు, నేతల ప్రసంగాల వీడియోలు నిత్యం పోస్టు చేస్తుంటారు. నెల వ్యవధిలో మంచిగా లక్షల మంది ఫాలోవర్లను సంపాదిస్తారు. ఇప్పుడు నేతలు వారిని సంప్రదించి.. ఫాలోవర్​కు రూ.3 నుంచి రూ.5 చొప్పున ధర నిర్ణయిస్తారు. ఆ తర్వాత అడ్మిన్లను తొలగిస్తారు. ఇంకా ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తే ఖాతాను వారి పేర్ల మీదకు మారుస్తారు.

How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు

వ్యూహకర్తలకు ఊహించని డిమాండ్​ : ఎన్నికల్లో వ్యూహకర్తలకు అనగా సోషల్​ మీడియా స్ట్రాటజిస్టులకు భలే గిరాకీ పెరిగింది. వీరిని వివిధ పార్టీల అభ్యర్థులు, ఆశావహులు తాత్కాలికంగా చేర్చుకుంటున్నారు. ఎన్నికలకు అనుగుణంగా అప్పటికప్పుడు పర్యటనలు, ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునేలా పోస్టులు చేయడానికి ఉపయోగపడుతున్నారు. ఇలా వీరిని అందించేందుకు నగరాల్లో ప్రత్యేకంగా కన్సల్టెన్సీలు ఏర్పాటు అయ్యాయి.

ఫాలో కాకున్నా.. ప్రకటనలు వచ్చేస్తాయి : సోషల్​ మీడియాలో ఎవర్ని ఫాలో కాకపోయినా ప్రతి ఒక్కరికీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ప్రకటనలు ప్రత్యక్షం అవుతాయి. దీనికోసం కొందరు నేతలు సామాజిక మాధ్యమాల్లో సొంతంగా ఖాతాలు తెరిచి ముందు భాగంగాలో వచ్చేలా ప్రకటనలు చేస్తున్నారు. అలాగే నిర్ణీత రుసుముతో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో ఇటువంటి వ్యవస్థ అందుబాటులో ఉంది. యూట్యూబ్​ తరహాలో ప్రకటనలు ఖాతాదారులందరికీ వస్తాయి. రీల్స్​, పోస్టులు చూస్తున్నప్పుడు.. అభ్యర్థుల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి.

Election Campaign Vehicles Being Prepared : ఊపందుకున్న ఎన్నికల ప్రచార పర్వం.. సిద్ధమవుతున్న రథాలు

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.