ETV Bharat / state

ఊరూరా హోరెత్తిన ప్రచారం - ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా - Congress Campaign in Telangana Assembly Elections

Telangana Election Campaign 2023 : శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ.. అభ్యర్థుల ప్రచారాలు ఊరూరా.. వాడవాడనా జోరుగా సాగుతున్నాయి. ప్రచార రథాలతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న నాయకులు.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటేసి గెలిపించాలంటూ జనాలను కోరుతున్నారు.

Political Parties Campaign in Telangana
Telangana Election Campaign 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 1:45 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం

Telangana Election Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓ వైపు ఇంటింటి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ.. మరో వైపు వినూత్న ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట్‌ డివిజన్‌లో పలు బస్తీలలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ.. తమకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రచారం చేయడానికి వచ్చిన తలసానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.

మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ - ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వని ప్రజలు - ఈసారి గెలుపు ఎవరిదో?

Political Parties Campaign in Telangana : మరోవైపు జూబ్లీహిల్స్‌లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP president Purandeswari) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే -2ఏ బొగ్గు గనిలో.. బీఆర్ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్మికులతో కలిసి మాట్లాడిన చందర్‌.. తనకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం

Telangana Assembly Elections 2023 : మరోవైపు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో మంత్రి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (Minister Puvvada Ajay Kumar) రోడ్‌ షో నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటేసి మూడోసారి గులాబీ పార్టీని గెలిపించాలని పువ్వాడ ఓటర్లను అభ్యర్థించారు.

"అభివృద్ధిని చూసి ఓటేయండి. తెలంగాణ రాకుండా అడ్డుకుంది కాంగ్రెస్. ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. కారు గుర్తుకే ఓటేసి మూడోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలి." - పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి

తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్​ క్యాంపెయినర్లు

మరోవైపు ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao).. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ.. హస్తం పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా కౌన్సిలర్ పంబల లక్ష్మి.. బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పంబల బిక్షపతి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఓటర్లకు పంచుతూ.. ఓట్లు అభ్యర్థించారు.

పోటాపోటీగా విపక్షాల ప్రచారాలు - రంగంలోకి దిగిన జాతీయ నాయకులు

ఇక వారం రోజులే గడువు - ఓటర్లను పేరు పేరునా పలకరిస్తున్న నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.