ETV Bharat / state

రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రణాళికాశాఖ ప్రత్యేక పుస్తకం - ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి భట్టి - తెలంగాణ ఆర్థిక రంగంపై పుస్తకం ఆవిష్కరించిన భట్టి

Telangana Economy 2022-23 : రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సింహభాగం రంగారెడ్డి జిల్లాదే. 2022-23 ప్రాథమిక అంచనాల ప్రకారం జీఎస్డీపీలో రంగారెడ్డి జిల్లా వాటా 18 శాతానికి పైగా ఉంది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉండగా ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలోనూ రంగారెడ్డి, హైదరాబాద్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా వికారాబాద్ చివరన ఉంది. రాష్ట్రంలో సగానికి పైగా వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఐటీ ఎగుమతుల్లో 31 శాతం వృద్ధి ఉండగా ఐటీ ఉద్యోగుల సంఖ్యలో 16శాతం పెరుగుదల ఉంది.

Telangana District Gross Domestic Product
Telangana Economy
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 11:39 AM IST

రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రణాళికాశాఖ ప్రత్యేక పుస్తకం ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

Telangana Economy 2022-23 : రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించి ప్రణాళిక శాఖ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka) ఆవిష్కరించిన తెలంగాణ ఎకానమీ పుస్తకంలో పలు వివరాలను పొందుపరిచారు. 2022-23 ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రూ.13 లక్షల 13 వేల 391 కోట్ల జీఎస్డీపీ వృద్ధి రేటు 16.3శాతం కాగా జాతీయ వృద్ధి 16.1శాతంగా ఉంది. జిల్లాల వారిగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి అగ్రభాగాన ఉంది. రంగారెడ్డి స్థూల ఉత్పత్తి రూ. 2 లక్షల 41 వేల 843 కోట్ల గా అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 18 శాతానికి పైగా ఉంది. రూ.లక్ష 86 వేల158 కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో 76 వేల 415 కోట్లతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి.

రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు - 1.19 కోట్ల వంట గ్యాస్ వినియోగదారులు

Telangana District Gross Domestic Product : సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు 35వేల నుంచి 75 వేల కోట్ల మధ్య ఉన్నాయి. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు 25 వేల నుంచి 35వేల కోట్ల మధ్య ఉన్నాయి. కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మెదక్, హనుమకొండ, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు 15 వేల నుంచి 25వేల కోట్ల మధ్యలో ఉన్నాయి. మిగిలిన జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, జనగాం, జయశంకర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు జిల్లాల స్థూల ఉత్పత్తి 15 వేల కోట్ల కంటే తక్కువగా ఉంది. కొమరం భీమ్ జిల్లా స్థూల ఉత్పత్తి 9,577 కోట్లుగా అంచనా వేయగా ములుగు జిల్లా 6,162 కోట్లతో చివరన ఉంది.

Per Capita Income Of Telangana : ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం అంచనా రూ. 3 లక్షల12 వేల 398 ఇది జాతీయ సగటు రూ. లక్ష 72 వేల 276 కంటే అధికంగా ఉంది. 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఐదు, ఆరేళ్లలో రెట్టింపు అయిందని ఇదే సందర్భంలో జాతీయ సగటు ఎనిమిది సంవత్సరాలుగా ఉందని వివరించారు. తలసరి ఆదాయం విషయంలోనూ రంగారెడ్డి జిల్లా రూ.8,15,996 మొదటి స్థానంలో ఉంది. 4,03,214 రూపాయలతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.3,08,166

తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్‌

జిల్లాల వారిగా తలసరి ఆదాయం : మేడ్చల్-మల్కాజ్‌గిరి,యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల తలసరి ఆదాయం రెండు లక్షల నుంచి రూ.2,75,000 మధ్య ఉంది. కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ములుగు, వనపర్తి జిల్లాల తలసరి ఆదాయం లక్షా 75 వేల నుంచి రూ. రెండు లక్షల మధ్య ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, నారాయణపేట, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, హన్మకొండ, వికారాబాద్ జిల్లాల తలసరి ఆదాయం రూ. లక్షా 50 వేల నుంచి లక్షా 75 వేల మధ్య ఉంది.

తెలంగాణ ఆర్థిక రంగం వాటా : రూ.1,55,525 తలసరి ఆదాయంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్ర ఎకానమీలో సేవా రంగాల వాటా అధికంగా ఉంది. స్థిరాస్థి, ఐటీ, ప్రొఫెషనల్స్ సేవా రంగాల వాటా 23 శాతం కాగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, గనుల రంగాల వాటా 20 శాతంగా ఉంది. వ్యాపారం, హోటల్స్ రంగాల వాటా 18 శాతం కాగా తయారీ రంగం వాటా 11 శాతంగా ఉంది. రవాణా, కమ్యూనికేషన్ల రంగం వాటా ఎనిమిది శాతం ఆర్థిక రంగం వాటా ఐదు శాతం నిర్మాణ రంగం వాటా నాలుగు శాతంగా ఉంది. మిగిలిన ఇతర రంగాల వాటా 11 శాతం. ఉపాధి విషయానికి వస్తే మాత్రం అత్యధికంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారు.

Telangana Employment Sector Share : రాష్ట్రంలో కోటిన్నర మంది వివిధ ఉపాధిలో ఉండగా అందులో 51 శాతం వాటా వ్యవసాయం, అనుబంధ శాఖలతో పాటు గనుల రంగాలదే. తయారీ రంగంలో 12 శాతం వ్యాపారం, హోటళ్ల రంగంలో పది శాతం నిర్మాణ రంగంలో ఎనిమిది శాతం ఉపాధి పొందుతున్నారు. రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో నాలుగు శాతం ఐటీ, ప్రొఫెషనల్స్ రంగంలో నాలుగు శాతం విద్య, వైద్య రంగాల్లో మూడు శాతం ఉపాధి పొందుతున్నారు. ఇతర రంగాల్లో ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు. 2022-23లో ఐటీ, ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో వృద్ధి 31 శాతం ఉండగా ఐటీ ఉద్యోగుల సంఖ్యలో 16 శాతం వృద్ధి నమోదు అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. EMI భారం యథాతథం!

త్వరలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - సీఎస్, నిఘా అధిపతితో సీఎం సుదీర్ఘ భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.