తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ-సెట్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఎస్సీ, ఎస్టీలకు 400 రూపాయలు, ఇతరులకు 800 రూపాయలు రుసుము ఖరారు చేశారు. జులై 1న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు కన్వీనర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఆన్‌లైన్‌లో ఈసెట్ జరగనుంది.