ETV Bharat / state

తెలంగాణ డిస్కం కొత్త యాప్​... మీటరు ఫొటోతో కరెంటు బిల్లు - తెలంగాణ డిస్కం కరెంటు బిల్లులు

కరోనా వ్యాప్తి చెందడం... లాక్​డౌన్​ విధించడం వల్ల తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థలు మీటర్​ రీడింగ్​ను చేయలేదు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఓ కొత్త యాప్​ను తయారు చేసేందుకు ఉత్తర తెలంగాణ డిస్కం కసరత్తు చేస్తోంది. మీటరు ఫొటో తీస్తే చాలు కరెంటు బిల్లు వచ్చేలా ఆ యాప్​ను రూపొందించనున్నారు.

తెలంగాణ డిస్కం కొత్త యాప్​... మీటరు ఫొటోతో కరెంటు బిల్లు

author img

By

Published : Apr 23, 2020, 5:18 AM IST

లాక్‌డౌన్‌ ఆంక్షలతో కరెంటు మీటరు రీడింగుల నమోదును తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వచ్చే నెలకు వాయిదా వేశాయి. దిల్లీలో మాత్రం ఎవరి ఇంటి మీటరు ఫొటో వారే ఫోన్‌లో తీసి ఆన్‌లైన్‌లో పంపితే ప్రోత్సాహకాలు ఇస్తామని దిల్లీ విద్యుత్‌ నియంత్రణ మండలి (డీఈఆర్‌సీ) ప్రకటించింది. ఇందుకు దిల్లీ డిస్కంలు యాప్‌ను రూపొందించాయి.

వినియోగదారులే మీటరు రీడింగ్‌ను తీసి ఆన్‌లైన్‌లో పంపడానికి అవకాశం కల్పించేందుకు ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర తెలంగాణ డిస్కం సైతం కసరత్తు చేస్తోంది. దీన్ని వినియోగించాలంటే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతి ఇవ్వాలి. టీహబ్‌ నుంచి పనిచేస్తున్న ఓ అంకుర సంస్థ సైతం ఇలాంటి యాప్‌ను రూపొందించింది. లాక్‌డౌన్‌లో ప్రయోగాత్మకంగా వాడేందుకు అనుమతించాలని డిస్కంలను తాజాగా కోరింది.

ఎలా పనిచేస్తుందంటే...

యాప్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో కరెంటు కనెక్షన్‌ నంబరు, ఫోన్‌ నెంబరు వివరాలు నమోదు చేయాలి. మీటరు రీడింగ్‌ను నెలకోసారి ఫోన్‌తో ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. ఆన్‌లైన్‌ ద్వారా డిస్కంకు చేరి ఎంత బిల్లు వచ్చిందో తెలిసిపోతుంది. ఆన్‌లైన్‌లోనే సొమ్ము కూడా చెల్లించవచ్చు.

దిల్లీలో ఏం చేశారంటే...

లాక్‌డౌన్‌ కాలంలో ఇంటింటికి వెళ్లి రీడింగ్‌ తీసుకోవడం ప్రమాదకరమని.. ప్రజలే మీటరు రీడింగ్‌ ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పంపేందుకు దిల్లీ డిస్కంలు ప్రోత్సహిస్తున్నాయి. సకాలంలో బిల్లు చెల్లించేవారికి ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ఉదాహరణకు ప్రతినెలా 20వ తేదీలోగా కరెంటు బిల్లు కట్టాలి. 7వ తేదీలోగా చెల్లిస్తే బిల్లు సొమ్ములో ఒక శాతం రాయితీ ఇస్తున్నారు. 8 నుంచి 14వ తేదీలోగా చెల్లిస్తే 0.5 శాతం సొమ్ము రాయితీ వస్తుంది.

ప్రజలకు సొమ్ము ఆదా

నిబంధనల ప్రకారం ప్రతి 30 రోజులకు ఒకసారి రీడింగ్‌ తీసి బిల్లు ఇవ్వాలి. రీడింగ్‌ తీసేవారు ఆలస్యంగా వస్తే శ్లాబు మారి బిల్లు పెరిగిపోతుంది. వినియోగదారుడు సరిగ్గా 30 రోజులకు తానే రీడింగ్‌ ఫొటోతీసి ఆన్‌లైన్‌ ద్వారా పంపితే ఈ భారం తప్పుతుంది. మీటరు రీడింగ్‌ ఫొటోతో బిల్లు వచ్చేలా తాము సొంతంగా యాప్‌ తయారుచేస్తున్నామని.. త్వరలో అందుబాటులోకి తెస్తామని ఉత్తర డిస్కం సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.