ETV Bharat / state

DGP Anjani Kumar: 'ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరింత అప్రమత్తంగా పనిచేయండి' - సైబర్ నేరాల నియంత్రణపై అంజనీకుమార్ సమీక్ష

DGP Anjani Kumar Review Meeting : పోలీసు అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ఒక పరీక్షగా ఉంటుందని.. ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో సీపీలు, ఎస్పీలతో సమీక్ష చేపట్టిన డీజీపీ.. శాంతి, భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

DGP Anjani Kumar
DGP Anjani Kumar
author img

By

Published : Apr 14, 2023, 9:19 PM IST

DGP Anjani Kumar Review Meeting: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి, భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లోని డీజీపీ కార్యలయంలో పోలీస్ కమీషనర్లు, జిల్లా ఎస్పీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు.. పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహించడం జరుగుతోంది. కనుక శాంతి భద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్​ల పనితీరు అత్యంత కీలకమని అంజనీకుమార్ తెలిపారు. డా. బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మాణానికి రాష్ట్రంలోని అందరు పోలీసు అధికారులు పునరంకితం కావాలని డీజీపీ అంజనీ కుమార్ కోరారు.

సరికొత్త వ్యూహంతో పనిచేయాలి : పోలీసు అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ఒక పరీక్షగా ఉంటుందని.. ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్​గఢ్, ఝార్ఖండ్​లకు చెందిన సరిహద్దు జిల్లాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్​కు వచ్చే వారితో పోలీసు శాఖ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని అంజనీకుమార్ స్పష్టం చేశారు.

సైబర్ నేరాల నివారణకు ప్రజలలో చైతన్యమే మార్గం : ఏ ప్రాంతంలోనైనా పోలీసు అధికారులు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే... పోలీసు శాఖకే మచ్చగా నిలుస్తుందని డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. ప్రపంచంతో పాటు మన రాష్ట్రంలోనూ సైబర్ నేరాల పెరుగుదల ఉందని.. వాటి పట్ల ప్రజలను చైతన్య పర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అంజనీ కుమార్ పేర్కొన్నారు. సైబర్​క్రైమ్ అనేది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని.. గ్రామాలకూ వ్యాపించిందన్నారు. ఈ నేరాల నివారణకు కేవలం ప్రజలలో చైతన్యమే మార్గమని తెలిపారు. ఇందుకు గాను, రాష్ట్రంలోని ప్రతీ పోలీస్​స్టేషన్లో కనీసం పది మంది పోలీసు అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో ప్రత్యేక శిక్షణనివ్వాలని ఆదేశించారు.

సోషల్ మీడియాను మరింత పటిష్ఠ పర్చుకోవాలి : ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగిందని.. ఈ నేపథ్యంలో పోలీసు విభాగాల్లోని సోషల్ మీడియాను మరింత పటిష్ఠ పర్చుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా ఉన్నాయని వాటి నివారణకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను కోరారు. ప్రస్తుత రంజాన్ పండగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్​లతో పాటు అన్ని జిల్లాల పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా వహించాలని డీజీపీ అంజనీకుమార్​ అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.