ETV Bharat / state

హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధించొద్దు: సీపీఎం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు పెరిగిపోతుండటం వల్ల హైదరాబాద్ వాసుల్లో భయాందోళన మొదలైంది.

Telangana CPI leaders Said that Do not impose another lock-down in Hyderabad
హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధించకండి
author img

By

Published : Jun 29, 2020, 2:06 PM IST

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ సీపీఎం నాయకులు ఆరోపించారు. ఖైరతాబాద్‌ ప్రధానకూడలి వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరిస్తూ సీపీఎం నేతలు గంటపాటు ధర్నా చేపట్టారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. అలాగే ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహించాలని నేతలు కోరారు. మరోసారి గ్రేటర్‌ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించాలనుకోవడం సరైన చర్య కాదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.