Telangana Congress Screening Committee Meeting in Delhi : తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్(Congress war Room)లో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా.. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేశారు. 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ(Pradesh Election Committee) 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసింది. ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్ కమిటీ నివేదించనుంది. ఈ సమావేశంలో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధు యాస్కీ పాల్గొన్నారు.
Telangana Congress Focus on MLA Candidates Selection : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక(MLA Ticket)ను పూర్తి చేయనుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులలో ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates 2023 : ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసింది. పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానములో జమిలి ఎన్నికలు(Jamili Elections 2024) వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ.. కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee)కే నివేదించనుంది.
Telangana Congress MLA Tickets 2023 : పీఈసీ జాబితాని నిశితంగా పరిశీలించి.. కేంద్ర ఎన్నికల కమిటీకి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా(Congress MLA Candidates First List) విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్ల కోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు దిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను(AICC Leaders) ఆశావహులు కోరుతున్నారు. కొందరు నాయకులు దిల్లీ వెళ్లి స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్