ETV Bharat / state

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు - Priyanka and DK Strategic Steps for Telangana

Telangana Congress New Strategy : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపేందుకు సంసిద్ధం అవుతుంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​లను పలు బాధ్యతలు అప్పజెప్పింది. ఇప్పటికే రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపిన నేతలు.. రాబోయే సభల్లో పలు డిక్లరేషన్లపై క్లారిటీ ఇవ్వనున్నారు.

Assembly Elections
Telangana Congress Plans To Assembly Elections
author img

By

Published : Aug 12, 2023, 12:46 PM IST

Telangana Congress New Strategy : కర్ణాటకలో ఘన విజయం తర్వాత తెలంగాణపై(Telangana Assembly Elections) గట్టి నమ్మకంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్​. రాష్ట్రంలో మరింత సమర్థంగా ముందుకెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలో రాబోతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారాలు, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​లకు అప్పగిస్తూ హస్తం అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Priyanka and DK Strategic Steps for Telangana : కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి, ఏఐసీసీ కార్యదర్శులు తమ కర్తవ్యాలను కొనసాగిస్తున్నారు. పార్టీ నేతలతో తరతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా అగ్రనేతలు ఇద్దరు ముఖ్యులను కేటాయించడం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్​ అధిష్ఠానం తరఫున ప్రియాంక గాంధీ, శివకుమార్​లు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోను నిర్ణయాలు తీసుకోనున్నారు.

Priyanka Gandhi and DK Enters in Telangana Campaign : ముఖ్యంగా నాయకుల అన్నింటికంటే నాయకుల మధ్య ఐక్యతను కాపాడటం, వారంత కలిసి పని చేసేలా చూడటం, వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావడం.. ఇలా అన్ని అంశాల్లోను ప్రియాంక, డీకే.. కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చే సర్వేల నివేదికలూ కీలకంగా మారనున్నాయి. రాష్ట్రంలో సోనియా, రాహుల్​, ఖర్గేలతో సభలు నిర్వహించి.. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రియాంక గాంధీ, డీకే, శివకుమార్​లు చూస్తారని తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం దీనికి సంబంధించి డీకే శివకుమార్​ కొందరు నాయకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

KC Venugopal on Telangana Assembly Elections : 'భేదాభిప్రాయాలను పక్కన పెట్టేయండి.. కలిసి నడిస్తే ఈసారి మనదే విజయం'

Responsibilities to Priyanka Gandhi and DK for Telangana : బీఆర్​ఎస్​పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. (BRS) అదే వారికి లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్​ నాయకులు చెబుతున్నారు. 35కు పైగా నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​కు బలమైన అభ్యర్థులు లేకపోవడం కాంగ్రెస్​కు కలిసి వస్తుందని భావిస్తోంది. ఈ పార్టీ నాయకుల మధ్య అనైక్యత, వనరుల కొరత ఇలా చాలా అంశాలు బీఆర్​కు సమస్యగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy), మహబూబ్​నగర్​ జిల్లా నుంచి జూపల్లి కృష్ణరావు మినహా ఇతర జిల్లాలో నుంచి గుర్తింపున్న నాయకులెవరూ కాంగ్రెస్​ గూటికి రాలేదురంగారెడ్డి జిల్లాలో ఓ మాజీ మంత్రి కుటుంబ చేరుతుందని కాంగ్రెస్​ వర్గాలు కొన్నాళ్లుగా చెబుతూ వచ్చింది. కానీ బీఆర్ఎస్​ నాయకులు రంగ ప్రవేశం చేసి హస్తానికి చిక్కకుండా అడ్డుకట్ట వేసినట్లు తెలిసింది. కాంగ్రెస్​ నాయకులు మాత్రం ఆ మాజీ మంత్రిపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు.

Congress Strategy for Telangana Assembly Election 2023 : హైదరాబాద్​, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్​ తదితర జిల్లాల్లో బలమైన నాయకుల కోసం గాలిస్తున్నారు. అయితే.. నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చకుండా... నాయకులంతా కలిసికట్టుగా పని చేసే విధంగా చూడటంపై కాంగ్రెస్​ అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ నాయకులంతా కలిసి ప్రచారం చేయడం, హస్తం పార్టీ ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలతోపాటు ఇతర నియోజకవర్గాలని గెలిపించే బాధ్యత తీసుకోవడంపై అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. టీ-కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేతలంగా ఇప్పటికే బెంగళూరు వెళ్లి శివకుమార్(DK ShivaKumar)​ను కలిశారు. ఆయన కూడా రెండు, మూడు రోజులుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, నాయకుల బలాబలాలపై, పనితీరు తదితర అంశాలపై కొందరితో చర్చలు జరిపినట్లు తెలిసింది.

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

Revanth Reddy Fires on CM KCR : 'నన్ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. బీఆర్​ఎస్​కు ఈసారి 25 సీట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.