Telangana Congress MLA Candidates List Today : శాసనసభ ఎన్నికలకు బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితా(Telangana Congress First List 2023)ను నేడు కాంగ్రెస్ విడుదల చేయనుంది. 70స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైనా.. వామపక్షాలతో పొత్తు చర్చలు నడుస్తున్నందున 58 స్థానాలకే తొలి జాబితా విడుదల చేయనున్నారు. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బరిలో దిగనున్నారు.
వామపక్షాలతో పొత్తు(T Congress Alliance with Left Parties), ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, స్క్రీనింగ్‌కమిటీ చైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారం ఆరు గంటలపాటు సమావేశమై.. అనేక విషయాలు చర్చించారు. స్క్రీనింగ్ కమిటీ(Congress Screening Committee) మరోమారు సమావేశమయ్యే పరిస్థితి లేనందున.. ఈ భేటీలో మరో 22 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలిసింది.
Congress Bus Yatra in Telangana : శనివారం నాటి చర్చలో వరంగల్ తూర్పు కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి, డోర్నకల్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ మురళీ నాయక్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిని రెండో జాబితాలో విడుదల చేయనన్నట్లు సమాచారం. గతంలో 70 స్థానాలపై.. స్క్రీనింగ్‌కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినా ఆదివారం 58 మందితోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారు. వామపక్షాలు పొత్తుకు సంబంధించి ఐదుస్థానాలు పక్కన పెట్టారు. ఇదే భేటీలో ప్రియాంక, రాహుల్ గాంధీ పాల్గొననున్న బస్సుయాత్ర (Congress Bus Yatra)పైన చర్చించారు.
"మిగతా రాష్ట్రాలతో కలిపి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుంది. మొదట 58 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారు. మిగిలిన సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో తుది రూపు వస్తుంది. వామపక్షాలతో చర్చలు కూడా తుదిదశలో ఉన్నాయి. విజయానికి తొలి ప్రాధాన్యత, విధేయతకు రెండో ప్రాధాన్యత ఇస్తాం. 19 సీట్లే ఉన్నాయి అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం." - మురళీధరన్, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్
Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'
Congress Alliance With CPM CPL Parties : భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడను సీపీఎం.. కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్‌లో సీపీఐ డిమాండ్ చేస్తున్నాయని.. ఐతే చెరో రెండు సీట్లు, ఒక ఎమ్మెల్సీ హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. భద్రాచలంపై సీపీఎం పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది. ఐతే అక్కడ కాంగ్రెస్‌కి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నందున ఆయనతో ఓసారి చర్చించి ఆయన పినపాకకు వెళ్లేందుకు అంగీకరిస్తే భద్రాచలం సీపీఎంకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకు గెలుపు, పార్టీకి విధేయతను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పారు.