ETV Bharat / state

కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదల - తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు

Congress
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 10:06 PM IST

Updated : Nov 10, 2023, 6:48 AM IST

22:03 November 09

కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదల

నేడు కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్న రేవంత్‌రెడ్డి

Congress MLA Candidates Final List : నాలుగు విడతల్లో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే మూడు విడతల్లో 116 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ.. అందులో ఇద్దరి స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇక తాజాగా గురువారం రోజున ఈ రెండు స్థానాలతో పాటు మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన హస్తం పార్టీ.. నర్సాపూర్, మహేశ్వరం, బాన్సువాడ, నారాయణఖేడ్‌కి చెందిన అసంతృప్తులను స్వయంగా కేసీ వేణుగోపాల్ బుజ్జగించి పార్టీకి కలిసి పనిచేసేందుకు ఒప్పించారు. ఎట్టకేలకు నాలుగు విడతల్లో 118 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 55, రెండులో 45, మూడులో 16, నాలుగో విడతలో ఐదుచొప్పున.. అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ తుది జాబితా అభ్యర్థుల వివరాలు :

  • పటాన్‌చెరు - కాటా శ్రీనివాస్‌గౌడ్‌
  • చార్మినార్‌ - ముజీబుల్లా షరీఫ్‌
  • మిర్యాలగూడ - బాతుల లక్ష్మారెడ్డి
  • సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి
  • తుంగతుర్తి - మందుల సామేలు

Congress MLA Candidates in Telangana 2023 : కొత్తగూడెంను సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎంతో కలిసి వెళ్లాలని భావించినా.. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తులు లేకుండానే ముందుకెళ్తున్నాయి. బోథ్, వనపర్తి, పటాన్‌చెరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మార్పుచేశారు. బోథ్‌లో వెన్నెల అశోక్ బదులు గజేందర్, వనపర్తిలో చిన్నారెడ్డికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇచ్చేలా నచ్చచెప్పి మేఘారెడ్డికి కేటాయించారు.

Telangana Assembly Election Nominations Last Date : నేటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పీటముడి పడిన 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. పటాన్‌చెరు స్థానానికి అభ్యర్థిని మార్చి.. నీలంమధుకి బదులు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ను ప్రకటించారు. మహేశ్వరం పారిజాతారెడ్డి, నర్సాపూర్ గాలి అనిల్ కుమార్, బాన్సువాడ బాలరాజు, నారాయణఖేడ్‌కి చెందిన సంజీవరెడ్డిని పిలిపించుకొని స్వయంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.అభ్యర్థులను మార్చేది ఉండదని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీఇవ్వగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనకు.. కాంగ్రెస్ చరమగీతం పాడబోతోందని కేసీ వేణుగోపాల్ జోస్యం చెప్పారు.

Revanth Reddy Nomination in Kamareddy Today : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనంతరం జరిగే బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్‌ పెట్టినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

Congress 100 MLA Candidates Selection Process : 100 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా నిర్ణయించిందో తెలుసా..!

Ticket Clashes in Telangana Congress : రెండో జాబితా తెచ్చిన తంటా.. కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి!

Last Updated : Nov 10, 2023, 6:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.