ETV Bharat / state

ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్ - Mallikarjuna Kharge to release Congress Manifesto

Telangana Congress Manifesto 2023 : ఏకకాలంలో రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ! మూడు లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు! మెట్రో రైలు ఛార్జీలలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50 శాతం రాయితీ.. వంటి ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో సిద్ధమైంది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రతి రోజు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటూ.. 10 గ్రాముల బంగారం ఇస్తామని హామీలతో కూడిన మేనిఫెస్టోను ఇవాళ హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Congress Manifesto
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 8:32 AM IST

Updated : Nov 17, 2023, 9:16 AM IST

ప్రజాకర్షక హామీలతో సిద్ధమైన కాంగ్రెస్‌ మేనిఫెస్టో

Telangana Congress Manifesto 2023 : సబ్బండ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో (Telangana Congress Manifesto) సిద్ధం చేసింది. ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా.. శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ వివిధ వర్గాలను సంప్రదించి పలు అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలకు రూ.25,000 పింఛన్‌ సహా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Telangana Congress Promises 2023 : తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీతో పాటు.. రూ.3 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని మరింత స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో అవినీతి, అవకతవకల ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపినట్లు సమాచారం.

Congress Manifesto in Telangana 2023 : ధరణి స్థానంలో (Dharani Portal) 'భూమాత' పోర్టల్‌ను ప్రవేశ పెట్టి.. భూ హక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'ల్యాండ్ కమిషన్‌' ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. గతంలో పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి భూ హక్కులను కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో తెలిపినట్లు సమాచారం. పంచాయతీల అభివృద్ధి నిధుల్ని సర్పంచుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని వెల్లడించింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక - ప్రచార కాక

బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపింది. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు సహా.. మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో విద్యారంగం వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మూతబడిన 6,000ల పాఠశాలను పునఃప్రారంభిస్తామని, బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటీలు, ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

Key Promises Telangana Congress Manifesto : కార్పొరేషన్‌, మున్సిపాలిటీ కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలతో.. బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. వార్షిక జాబ్ క్యాలెండర్‌ ద్వారా పారదర్శకంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా, ఆరునెలల్లోపు మెగా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ కల్పించనున్నట్లు తెలిపింది. సింగరేణిలో కారుణ్య నియామకాలను పునఃపరిశీలించి సరళీకృతం చేస్తామని పేర్కొంది.

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ప్రభుత్వ ఆసుపత్రులను నవీకరించి.. మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించింది. ఉస్మానియా ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ఆధునికరించి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి.. మోకాలు సర్జరీని కూడా చేరుస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ పింఛన్‌ స్కీమ్‌ను రద్దుచేసి.. ఓపీఎస్‌ పద్ధతిని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫారసులను అమలు చేస్తామని పేర్కొంది.

వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులను కూడా చేర్చుతామని తెలిపింది. 5 ఏళ్ల లోపు ప్రాక్టీసింగ్‌ జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000ల గౌరవ భృతి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందచేస్తామని వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

Telangana Congress Manifesto will Released Today : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు.. కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పాటుకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీల “కుల గణన” చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పనను పొందుపరిచినట్లు సమాచారం. బీసీ సబ్ ప్లాన్, ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు, మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం.

Congress Six Guarantees Telangana : నిరుపేద హిందూ, మైనారిటీ ఆడపడుచుల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు.. ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామని తెలిపింది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్ధిక సహాయంతో కూడిన 'బంగారు తల్లి' (Bangaru Thalli scheme) పథకాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చింది. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. దివ్యాంగుల పింఛన్‌ రూ.5016కి పెంచడం సహా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మెట్రో రైళ్ల చార్జీలలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తామని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్- ఆరాంఘర్-మెహదీపట్నం-బీహెచ్‌ఈఎల్‌ మార్గంలో కొత్త మెట్రో నిర్మిస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్‌ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునికీకరణ చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరిచింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : రేవంత్​రెడ్డి

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

Last Updated : Nov 17, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.