ETV Bharat / state

అభయహస్తం పేరిట - 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Telangana Congress Manifesto 2023 : తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్‌ ఒక్కరే అనుభవించారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తున్నామని.. రాష్ట్రంలోనూ వీటిని అమలు చేసి చూపించనున్నట్లు పేర్కొన్నారు. తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే ఆరు హమీలను ఆమోదిస్తామని.. వంద రోజుల్లోనే ఈ హామీలను అమలు చేయనున్నట్లు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

Telangana Congress Manifesto 2023
Telangana Congress Manifesto 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:59 PM IST

Updated : Nov 17, 2023, 2:40 PM IST

Telangana Congress Manifesto 2023 : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను (Telangana Congress Manifesto).. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge) విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ప్రకటించారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అక్షరాలా అమలు చేస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. హస్తం పార్టీకి అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.

Congress Manifesto in Telangana 2023 : బీజేపీ నేతలు బీఆర్ఎస్‌పై విమర్శలు తగ్గించేశారని మల్లికార్జున ఖర్గే అన్నారు. కేసీఆర్‌, మోదీ పరస్పర విమర్శలు మానేశారని చెప్పారు. కేసీఆర్‌కు (CM KCR) పదవీవిరమణ సమయం వచ్చేసిందని.. ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని ఆయన అంటున్నారని తెలిపారు. ఓటమి తప్పదని కేసీఆర్‌కు అర్థమైపోయిందని.. ముఖ్యమంత్రికి టాటా..బాయ్‌బాయ్.. చెప్పి పంపిస్తామని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

"తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్‌ ఒక్కరే అనుభవించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తున్నాం. తెలంగాణలోనూ 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తాం. తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే 6 గ్యారెంటీలను ఆమోదిస్తాం. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం." - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలు..

  • మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి
  • ఆర్టీసీ కార్మికులకు 2 పీఆర్సీ బకాయిల చెల్లింపు
  • పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులు
  • ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం
  • పెండింగు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం రాయితీ
  • బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు
  • ఎస్సీ వర్గీకరణ అమలు
  • మాదిగ, మాల, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్లు
  • బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన
  • సంచార జాతులకు 5శాతం రిజర్వేషన్
  • అన్ని జిల్లాల్లో జయశంకర్‌ పేరిట బీసీ భవన్లు
  • జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు
  • అన్ని వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
  • బీసీలు, మైనారిటీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు
  • సింగరేణి కారుణ్య నియామకాల సరళీకరణ
  • ఈఎస్‌ఐ పరిధిలోకి బీడీ కార్మికుల జీవిత బీమా
  • గీత కార్మికులకు రూ.10 లక్షల బీమా
  • యాదవ, కురుమలకు రూ. 2 లక్షల గొర్రెల పంపిణీ
  • అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత
  • స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల రుణం
  • పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం
  • 18 ఏళ్లు దాటిన విద్యార్థినికి ఉచితంగా స్కూటీ
  • అన్ని జిల్లా కేంద్రాలలో వృద్ధాశ్రమాలు
  • జూనియర్ లాయర్లకు నెలకు రూ. 5,000 భృతి
  • హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం
  • మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షలు
  • రేషన్‌ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం
  • రేషన్‌కార్డు ఉన్న వారికి సన్నబియ్యం
  • గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు
  • మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు
  • దివ్యాంగుల పింఛను రూ.5,016
  • దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • మెట్రోలో మహిళలు, వృద్ధులకు 50 శాతం రాయితీ
  • మెట్రోలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ
  • ఎల్బీనగర్-ఆరాంఘర్ మార్గంలో మెట్రో సౌకర్యం
  • మెహదీపట్నం-బీహెచ్‌ఇఎల్‌ మార్గంలో మెట్రో సౌకర్యం
  • ఆస్తి, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు
  • ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ పాఠశాలలు
  • ఏటా జాబ్‌ క్యాలెండర్‌, పారదర్శకంగా నియామకాలు
  • విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌
  • బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు
  • మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం
  • మూతబడిన 6 వేల పాఠశాలల పునఃప్రారంభం
  • కొత్తగా 4 ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు
  • ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
  • భూహక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్‌ కమిషన్‌
  • పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు
  • సర్పంచుల ఖాతాల్లోకి గ్రామ పంచాయతీ నిధులు
  • వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
  • ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ డీఏల చెల్లింపు
  • సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు
  • కొత్త పీఆర్సీ ఏర్పాటు, 6 నెలల్లో అమలు
  • అమరవీరుల కుటుంబానికి రూ.25 వేల పింఛను
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  • తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
  • తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల స్థలం
  • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
  • రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
  • అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం
  • దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
  • మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టుల భర్తీ

Key Promises Telangana Congress Manifesto : 37 అంశాలతో మేనిఫెస్టో కాంగ్రెస్ విడుదల చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy) పేర్కొన్నారు. 'అభయహస్తం' పేరుతో.. 42 పేజీలతో మేనిఫెస్టోను ప్రకటించిందని చెప్పారు. శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో రూపొందించిందని.. ఇది పార్టీకి భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటిదని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్ని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) అన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తామని చెప్పారు. ప్రజలకు సంపదను పంచే ప్రణాళికను మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ప్రజలకు సంపదను పంచే కార్యక్రమమే 'అభయహస్తం' మేనిఫెస్టో అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక - ప్రచార కాక

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

Last Updated : Nov 17, 2023, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.