ETV Bharat / state

ఇక ప్రజా ఉద్యమాలు... భాజపా, తెరాసపై కాంగ్రెస్ పోరు

Congress General Body Meeting: భాజపా, తెరాసలపై కాంగ్రెస్ పోరు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ యాప్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Congress
Congress
author img

By

Published : Mar 28, 2022, 9:18 PM IST

Congress General Body Meeting: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ యాప్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఉద్యమాలు...

Revanth Reddy Comments: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అడ్డగోలుగా పెరిగాయన్న రేవంత్... రాష్ట్రంలో భాజపా, తెరాస ధాన్యం కొనుగోలు విషయంలో నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మార్చి చివర వరకు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనాల్సిందేనని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండలాల వారీగా, నియోజక వర్గాలు, జిల్లా కేంద్రలలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేట్లు పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు జిల్లాల్లో తిరిగి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను వివరించాలన్నారు. ముఖ్య నాయకులు గ్రామాల్లో పర్యటించి సమస్య తీవ్రతను బట్టి పోరాటాలను విస్తృతం చేయాలన్నారు.

వరంగల్‌ సభకు రాహుల్...

నెల రోజులపాటు వరుస ఉద్యమాలు చేసి నెలాఖరు నాటికి ఏప్రిల్ చివరలో వరంగల్ రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు. అందుకు కార్యాచరణ ఇప్పటి నుంచే చేపట్టాలని... ధాన్యం కొనుగోలు విషయంలో ఉద్యమాల కార్యాచరణ కోసం మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో, సీనియర్లతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

నిరసనలు...

Congress Protests: ఏప్రిల్‌ రెండు నుంచి నాలుగో తేదీ వరకు ధరల పెరుగుదలను నిరసిస్తూ మండలాలు, నియోజక వర్గాల్లో ఉద్యమాలు నిర్వహించాలని రేవంత్ అన్నారు. 7న సివిల్ సప్లయ్, విద్యుత్ సౌధ వద్ద భారీ ధర్నా చేపట్టాలన్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మార్చి 31 కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర అయిందని దండోరా వేయించాలని, డప్పులు కొట్టి నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. జీఓ 111 విషయంలో కేసీఆర్... అస్పష్టత ప్రకటన చేశారని, దానిని తొలగించడానికి తీసుకున్న నిర్ణయాలపై ఒక విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేయాలన్నారు. మాజీ మంత్రి, పర్యావరణ అంశాలపై అవగాహన ఉన్న మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితర నిపుణులతో కమిటీ వేసి ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టాలన్నారు.

ఇదీ చూడండి: రేవంత్‌కు ఫ్రీహ్యాండ్... అసంతృప్తులకు హైకమాండ్ షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.