ETV Bharat / state

Telangana Congress Candidates Selection 2023 : 64 సీట్లపై తర్జన భర్జన.. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రతిష్ఠంభన! - కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా జాప్యం

Telangana Congress Candidates Selection 2023 : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని సీట్ల విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రతిష్ఠంభన నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన సమావేశం కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ రెండో జాబితాకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. వామపక్షాలకు సీట్ల సర్దుబాటు, మరికొన్ని చేరికలు ఉండడంతో మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Congress MLA Candidates List Delay
Congress Candidates Selection Process on Objections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 2:12 PM IST

Telangana Congress Candidates Selection 2023 : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, రాజకీయ పరిస్థితులను(Political Conditions) దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ కొన్నింటి విషయంలో సర్వేలను పక్కన పెట్టి ఎంపిక చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

ఇక్కడ సామాజిక సమీకరణాలు(Social Equations) సర్దుబాటు కాకపోవడంతో అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు.. మొదటి విడతలో వచ్చిన పేర్లను పరిశీలిస్తే మేడ్చల్‌ నియోజక వర్గంలో చాలాకాలంగా హరివర్దన్‌ రెడ్డి విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఓటర్లకు దగ్గరవుతూ వచ్చారు. సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే తనకే టికెట్‌ దక్కుతుందని అంచనా వేసుకున్నారు. కానీ అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వలేకపోవడంతో.. అన్నింటిని పక్కన పెట్టి సామాజిక సమీకరణాలను ఒక్కదానినే పరిగణనలోకి తీసుకుని తోటకూర జంగయ్య యాదవ్​కు టికెట్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress Alliance with Left Parties : మొదటి జాబితా 55 నియోజక వర్గాలను పక్కన పెడితే మిగిలిన 64 నియోజక వర్గాలలో కూడా సామాజిక సమీకరణాలను, రాజకీయ పరిణామాలను, ఆయా నియోజక వర్గాల్లో బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకుల(BRS Leaders) శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. ఇందుకు స్క్రీనింగ్‌ కమిటీ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వామపక్షాలు తమకు అనుకూలమైన స్థానాలను కేటాయించాలని పట్టుబడుతుండడంతో.. సీట్ల సర్దుబాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates List Delay : అదేవిధంగా కొన్ని నియోజక వర్గాల్లో సమఉజ్జీలు ఉండడంతో అక్కడ .. స్క్రీనింగ్‌ కమిటీలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సూర్యాపేట విషయంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పటేల్‌ రమేష్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చి రామిరెడ్డి దామోదర్‌ రెడ్డికి ప్రత్యామ్నాయం ఇద్దామని ఒక వర్గం ప్రతిపాదన పెట్టారు. కానీ ఈసారి దామోదర్‌ రెడ్డికే టికెట్‌ ఇవ్వలాని పార్టీ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం, అక్కడ బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకుడు మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadeesh Reddy) కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో ఆయనను బలంగా ఢీకొట్టే వాళ్లకే టికెట్‌ ఇద్దామని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ సూచించారు.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

అయినప్పటికీ రెండు వర్గాలు సమ్మతించకపోవడంతో.. దీంతో ఆ రెండు పేర్లను సీఈసీకి సిఫారసు చేయాలని స్క్రీనింగ్‌ కమిటీ భావిస్తున్నట్లు అభిప్రాయం. అదేవిధంగా అంబర్‌పేట విషయంలో ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతుండగా.. తన మద్దతుదారుడిని బరిలో నిలపాలన్న స్థానంలో.. ఇంకొకరి సిఫారసు ఏమిటని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు మండి పడ్డారు. తనపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు పెట్టిన నూతి శ్రీకాంత్‌ గౌడ్‌కు టికెట్‌ ఇచ్చేందుకు తనకు ఇష్టం లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ స్థానంపై కూడా ఎలాంటి నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. ఈ సీటు విషయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నట్లు హనుమంత్ రావు ఆరోపిస్తున్నారు.

Congress screening Committee Meetings : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) నేతృత్వంలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో పలు నియోజక వర్గాలల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరనట్లు అవగతమవుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మునుగోడు, వరంగల్‌ వెస్ట్‌ లాంటి నియోజక వర్గాలకు అభ్యర్థుల ప్రకటించాల్సి ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ప్రతిపాదనలపై ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. మరొక వర్గం సానుకూలత వ్యక్తం చేస్తుంది. అందుకే వాటిలో కొన్నింటిని రెండు పేర్లతో కేంద్ర ఎన్నికల కమిటీకి పంపినట్లు తెలుస్తోంది.

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

ఈ నెల 25న జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీలో దాదాపు 40మందితో కూడిన రెండో జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజు లేదా మరుసటి రోజు జాబితా ప్రకటన(List Announcement) ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దసరా తరువాత ఏ క్షణంలో అయినా రెండో జాబితా వచ్చే అవకాశాలు ఉందని.. ఈనెల 26, 27 తేదీల్లో రెండో విడత బస్సు యాత్ర ముగిసాక మూడో జాబితాపై పార్టీ దృష్టి సారిస్తుందని పార్టీ వర్గాల సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.