Telangana Congress MLA Candidates Second List : హస్తం పార్టీ(T Congress) ఈ నెల 15వ తేదీన 55 మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. రెండో జాబితాలో అయినా తమ పేర్లు వచ్చేట్లు చూసుకునేందుకు నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు చేరికలు కూడా ఊపందుకున్నాయి.
T-Congress MLA Candidates List : రాహుల్ గాంధీ నేతృత్వంలో బండి రమేష్, ఎమ్మెల్యే రేఖానాయక్, నారాయణ్‌రావు పటేల్ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పలు నియోజకవర్గాలకు బలమైన నాయకులు పార్టీకి దొరికినట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ్టి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంతో ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానుంది.
ఇప్పటికే ఒకే పేరుతో సీఈసీకి వెళ్లిన జాబితాలో కామారెడ్డి-షబ్బీర్ అలీ, భువనగిరి- కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, వరంగల్ తూర్పు- కొండా సురేఖ, జనగాం- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు, ఇల్లందు- కోరం కనకయ్య, జడ్చర్ల- అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తి- చిన్నారెడ్డి, నారాయణపేట- ఎర్రశేఖర్, మహేశ్వరం- పారిజాత నర్సింహారెడ్డి, చార్మినార్- అలీమస్కట్, కంటోన్మెంట్- పిడమర్తి రవి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Telangana Congress Latest News : ఇవే కాకుండా టికెట్ల కోసం గట్టిగా పోటీ పడుతున్న నియోజకవర్గాలను చూసినట్లయితే.. దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డి, కాటం ప్రదీప్ గౌడ్. మక్తల్ నుంచి శ్రీహరిముదిరాజ్, కొత్త సిద్ధార్థరెడ్డి. దేవరకొండ నుంచి వడ్త్యారమేష్ నాయక్, బాలునాయక్‌లు. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, దామోదర్ రెడ్డి. మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, రఘువీర్‌రెడ్డి. మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ప్రీతంలు టికెట్లు ఆశిస్తున్నారు.
పినపాక సీటు కోసం ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్యం, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ కుమారుడు సాయిరాం నాయక్‌లు పోటీ పడుతున్నారు. అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి, సత్తుపల్లి మానవతారాయ్, సంభాని చంద్రశేఖర్ రావు, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, అనిల్‌కుమార్, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్, రేణుక.. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సుజాత, ఖానాపూర్ నుంచి రేఖానాయక్, భరత్ చౌహాన్.. బోథ్ నుంచి సేవాలాల్ రాథోడ్, నరేష్ జాదవ్.. ముథోల్ నుంచి ఆనంద్‌రావు పటేల్, పత్తిరెడ్డి విజయకుమార్‌లు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి. కరీంనగర్ నుంచి కొత్త జైపాల్ రెడ్డి, రోహిత్‌రావు. హుజూరాబాద్ నుంచి బల్మూర్ వెంకట్, ప్రణవ్‌బాబు. చొప్పదండి మేడిపల్లి సత్యం, నాగిశేఖర్‌లు. కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్‌రావు, కొమిరెడ్డి కరంచంద్. నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్‌కుమార్ గౌడ్, ధర్మపురి సంజయ్, ఇరావత్రి అనిల్. నిజామాబాద్ రూరల్ నుంచి సుభాష్ రెడ్డి, భూపతి రెడ్డి నర్సారెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతుండగా మండవ వెంకటేశ్వరరావు కూడా ఇదే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Latest Political News : బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, అనిల్ కుమార్ రెడ్డి. ఎల్లారెడ్డి నుంచి మధన్‌మోహన్ రావు, సుభాష్ రెడ్డి. జుక్కల్ నుంచి గంగరాం, తోట లక్ష్మికాంతరావు. పరకాల నుంచి కొండా మురళి, ఇనగాల వెంకటరామిరెడ్డి. డోర్నకల్ నుంచి నెహ్రునాయక్, రామచంద్రనాయక్. పాలకుర్తి నుంచి జాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి. వర్దన్నపేట నుంచి కె నాగరాజు, సిరిసిల్ల రాజయ్య. నారాయణ ఖేడ్ నుంచి సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డిలు. నర్సాపూర్ నుంచి గాలి అనిల్‌కుమార్, ఆవుల రాజిరెడ్డిలు. దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక. పటాన్చెరు నుంచి కాటం శ్రీనివాస్‌గౌడ్, నీలం మధులు టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సిద్దిపేట నుంచి భవానీ రెడ్డి, పూజల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్. తాండూర్ నుంచి మనోహర్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. షేర్ లింగంపల్లి నుంచి రఘునాథ్ యాదవ్, జగదీశ్వర గౌడ్. ఎల్బీనగర్ నుంచి మధు యాష్కీ, మల్రెడ్డి రాంరెడ్డి. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, దండెం రామిరెడ్డిలు, కూకట్పల్లి నుంచి మన్నె సతీష్, శ్రీరంగం సత్యం, బండి రమేష్. రాజేంద్రనగర్ నుంచి గౌరీ సతీష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉన్నారు.
జూబ్లిహిల్స్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి, అజారుద్దీన్. ఖైరతాబాద్ నుంచి రోహిన్ రెడ్డి. విజయారెడ్డి, అంబర్ పేట నుంచి నూతి శ్రీకాంత్ గౌడ్, మోత రోహిత్‌లు టికెట్ల కోసం పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో సగానికిపైగా నియోజక వర్గాలకు చెందిన నాయకులతో కోఆర్డినేషన్ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రకటించాల్సిన 64 లో ఏకాభిప్రాయంతో అధిక సంఖ్యలో నియోజక వర్గాలకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.