ETV Bharat / state

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి - Revanth Reddy latest news

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ.. ప్రచార శంఖారావాన్ని పూరించింది. "తిరగబడదాం- తరిమికొడదాం" నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినూత్నంగా ప్రజాకోర్టు నిర్వహించి.. 14 ప్రజా వ్యతిరేఖ అంశాలను ప్రవేశపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం దిగిపోవాలని ప్రజాకోర్టు తీర్పునిచ్చింది. నెల రోజుల్లో గ్రామ గ్రామాన తిరిగి.. బీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు హస్తం పార్టీ ప్రకటించింది.

T-Congress Election Campaign committee
Telangana Congress Election Campaign
author img

By

Published : Aug 13, 2023, 7:31 AM IST

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి

Telangana Congress Assembly Elections Campaigning Plan : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. వినూత్న రీతిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పీసీసీ.. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టుకు న్యాయమూర్తిగా కంచె ఐలయ్య వ్యవహరించారు. ఈ కోర్టు వేదికకు రెండు వైపులా బోనులు ఏర్పాటు చేశారు. ఒకవైపు బోనులో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కటౌట్లను ఉంచారు. మరోవైపు బోనులోకి హస్తం నేతలు ఒక్కొక్కరుగా వచ్చి ప్రభుత్వం పని తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఛార్జిషీట్ రూపంలో ప్రజాకోర్టు ముందు పెట్టారు. బీసీ ఛార్జిషీట్​పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్, దళిత ఛార్జిషీట్​పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మైనారిటీ అంశాలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి, బీఆర్​ఎస్​ అవినీతిపై ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, గిరిజన అంశంపై మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తదితరులు... ఛార్జిషీట్‌లను ప్రజాకోర్టుకు వివరించారు.

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

T-Congress Election Campaign committee : అవినీతి చేయడంలో కేసీఆర్ ఇంట్లో.. కేటీఆర్, కవిత, హరీశ్​రావు పోటీ పడుతున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్​రావు ఠాక్రే ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ తీరుపై ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం చేతిలో 14 ముఖ్యమైన శాఖలు ఉన్నాయని.. తద్వారా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి.. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ ప్రారంభించిన "తిరగబడదాం- తరిమికొడదాం" అనే నినాదంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం కోసమే ఇచ్చినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కంటే.. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించింది. ప్రజలను సీఎం కేసీఆర్​ మోసం చేశారు. "తిరగబడదాం- తరిమికొడదాం" అనే నినాదంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయనున్నాం". - రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Fires on CM KCR : 'నన్ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. బీఆర్​ఎస్​కు ఈసారి 25 సీట్లే'

Congress Conduct People's Court : గద్దర్ మృతికి నివాళిగా ప్రజాకోర్టు వేదికపై.. కాంగ్రెస్‌ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. "తిరగబడదాం- తరిమికొడదాం" పేరుతో ప్రచార చిత్రాన్ని ప్రదర్శించారు. చివరగా కాంగ్రెస్ ప్రజాకోర్టు న్యాయమూర్తిగా కంచె ఐలయ్య తీర్పు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చిన సాక్ష్యాలను తన శక్తి మేర పరిశీలించానన్నారు. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేసి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పడమే తన తీర్పు అని కంచె ఐలయ్య తెలిపారు.

"కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చిన సాక్ష్యాలను నా శక్తి మేర పరిశీలించాను. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేసి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను కేసీఆర్ వంచించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పడమే నా తీర్పు" - కంచె ఐలయ్య, ప్రజాకోర్టు న్యామమూర్తి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ.. శ్రేణులను అప్రమత్తం చేసింది. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు క్షణం తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాలను చేపట్టి గెలుపునకు కృషి చెయ్యాల్సి ఉందని హస్తం పార్టీ అభిప్రాయపడుతోంది. నెలరోజుల పాటు "తిరగబడదాం- తరిమికొడదాం" నినాదంతో.. గ్రామ గ్రామాన బీఆర్​ఎస్​ వైఫల్యాలపై.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా 12వేల గ్రామాల్లో, 3,000 డివిజన్ స్థాయిలలో సమావేశాలను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నట్లు ప్రచార కమిటీ ప్రకటించింది.

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.