Telangana CM Revanth Reddy Gratitude Tweet : రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని పేరును ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది. హస్తం పార్టీ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానం మేరకు అందరూ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి సీఎల్పీ(CLP Leader) నేతగా, తదుపరి సీఎంగా పగ్గాలు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనను ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పార్టీలోని అగ్రనేతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
గౌరవనీయలైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తనలో నిత్యం స్ఫూర్తినింపిన నాయకుడు రాహుల్‌గాంధీ, ఛరిష్మా గల నాయకురాలు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో(DK Shiva Kumar) పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కష్టసుఖాల్లో అండగా నిలిచిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌చేశారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా రేవంత్ తన ట్వీట్లో అభివర్ణించారు.
-
I wholeheartedly express my gratitude to honourable AICC president
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka… pic.twitter.com/Kl50cQHxih
">I wholeheartedly express my gratitude to honourable AICC president
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka… pic.twitter.com/Kl50cQHxihI wholeheartedly express my gratitude to honourable AICC president
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka… pic.twitter.com/Kl50cQHxih
టీపీసీసీ పదవి ఇప్పుడే మార్చే అవకాశం లేనట్లే : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించడం స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డితో మరికొంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న పీసీసీ(TPCC) పదవి ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలో పదవులు కష్టపడ్డవారికి లభిస్తాయన్నారు.
రేవంత్ రెడ్డికి కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ శుభాకాంక్షలు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియామకమైన ఏ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ శుభాకాంక్షలు తెలిపింది. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రయోజన ప్రభుత్వ సంక్షేమ పథకాల 6 గ్యారంటీల(Congress Six Guarantees) అమలు కోసం సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుటకు ముందుంటామని తెలిపారు. రెండు దశాబ్దాల సీపీయస్ ఉద్యోగుల పాత పెన్షన్ ఆకాంక్షను నెరవేర్చబోతున్న ముఖ్యమంత్రికి మూడు లక్షల కుటుంబాలు సర్వదా రుణపడి ఉంటాయని పేర్కొన్నారు.
ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లలో అధికారులు
'ఇండియా' కూటమి భేటీకి కీలక నేతలు డుమ్మా- నష్టనివారణలో కాంగ్రెస్!