CM Kcr will Visit Hailstorm affected Districts : తెలంగాణలో వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో... సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇవాళ లేదా రేపు వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో... సీఎం పర్యటిస్తారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని.... సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులను... ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నివేదికల పరిశీలన అనంతరం..... ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరనున్నారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులకు 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని... వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా వేసింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు... పంట నష్టపోయారని తెలిపింది. ఎక్కువగా మొక్కజొన్న... తర్వాత వరి, మిర్చి, వేరుశనగ, పత్తిపంటలు దెబ్బతిన్నాయి. మామిడి, టమోటా, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ పంటలకు... నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ సమూహాల వారీగా... పంటనష్టంపై అధికారులు నివేదికలు రూపొందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా పంటనష్టం : అత్యధికంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో... 57వేల 855 ఎకరాల్లో పంట దెబ్బతినగా 43వేల 423 మంది రైతులు నష్టపోయారు. తర్వాత కరీంనగర్, నల్గొండ జిల్లాలు నష్టపోయాయి. సూర్యాపేట జిల్లాలో... 14వేల 429 ఎకరాల్లో పంట దెబ్బతింది. ఖమ్మంలో 18వేల ఎకరాల్లో... మొక్కజొన్న, 53ఎకరాల్లో పెసర పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో 15వందల 16 మంది రైతులు... 3వేల ఎకరాల్లో పంటను కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలో.. 19 వందల 23ఎకరాల పంట నష్టం జరిగింది.
రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వివిధ పార్టీల నేతలు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన రేవంత్‌రెడ్డి... వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటల వివరాల నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఉత్స విగ్రహాలుగా మారారన్న ఆయన... పంట నష్టం జరిగి రైతన్నలు బాధపడుతుంటే.. బీజేపీ నేతలు ఎందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడంలేదని ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో భారీ వర్షాలకు మండలంలో తడిసి ముద్దయిన మిర్చి పంటలను... సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను... కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీల నేతలు పరిశీలించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి అకాల వర్షాలతో దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: