ETV Bharat / state

తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకెళ్దాం: సీఎం కేసీఆర్

cm kcr tribute to pv: మంగళవారం పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి... దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కొనియాడారు.

cm kcr tribute to pv
cm kcr tribute to pv
author img

By

Published : Jun 27, 2022, 10:20 PM IST

cm kcr tribute to pv: ప్రధానమంత్రిగా వినూత్న విధానాలను అనుసరించి... దేశ సంపదను గణనీయంగా పెంచిన దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తి... తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు అని కేసీఆర్ కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.