మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని, మానవజాతిలో త్యాగం ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని వెల్లడించారు. మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు.
ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామన్నారు. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయని సీఎం పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా భాగ్యనగరంలో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు జరగనుంది. డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమై.. చాదర్‌ఘాట్ వరకు సాగనుంది.
ఇదీ చూడండి: Traffic restrictions : భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం నుంచి రాత్రి దాకా అమలు