Telangana CEO Vikasraj Pressmeet Today : పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేటీఆర్‌కు(Minister KTR) ఇచ్చిన నోటీసుపై ఇంకా వివరణ అందలేదన్నారు.
పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి : సీఈవో వికాస్ రాజ్
Telangana Assembly Elections 2023 : రాష్ట్ర ప్రభుత్వం 10 విజ్ఞప్తులు చేసిందని.. అందులో 9 ఆమోదం పొందినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో ఏమీ దొరకలేదని ప్రాథమిక నివేదిక వచ్చిందని, పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓ చెప్పారు. రవాణా సదుపాయంతో పాటు ప్రతి చోటా ఉండేలా 80 వేలకు పైగా వీల్ ఛైర్స్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించినట్లు తెలిపారు. అన్ని ఈవీఎం వాహనాలను జీపీఎస్ సదుపాయంతో ట్రాకింగ్ చేయనున్నట్లు వికాస్ రాజ్ వివరించారు.
రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,051 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఒకటికి మించి పోలింగ్ బూత్‌లు ఉన్న కేంద్రాల వద్ద బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలిపారు.
మద్యం సరఫరా, పంపిణీ, నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు చివరి 48 గంటల్లో 144 సెక్షన్ ఉంటుందని, ఈ సమయంలో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ రోజు అభ్యర్థులు ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించరాదని, మీడియా ప్రతినిధులు ఓటింగ్ ను వీడియో తీయరాదని అన్నారు. ఇప్పటి వరకు తనిఖీల్లో మొత్తం 709 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకోగా.. అందులో 282 కోట్లు నగదు, 118 కోట్ల విలువైన మద్యం, 40 కోట్ల విలువైన డ్రగ్స్, 186 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, 83 కోట్ల విలువైన ఇతర కానుకలు ఉన్నట్లు వివరించారు.
గురువారం జరగనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాము. పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పాము. మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ అందలేదు. - వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి