ETV Bharat / state

CABINET MEET: ఉద్యోగ ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గ భేటీ - మంత్రి వర్గ సమావేశం

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగింది.

CM KCR
మంత్రివర్గం
author img

By

Published : Jul 13, 2021, 1:30 PM IST

Updated : Jul 13, 2021, 9:24 PM IST

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్​ను రూపొందించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఏటా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని పేర్కొంది. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం భేటీ అవనుంది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్‌జీవో, టీజీవో విజ్ఞప్తిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టులను కేటాయించాలని... ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ వెంటనే జరగాలని ఆదేశించింది.

గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో... ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్‌కు నివేదికలు సమర్పించాయి. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో చర్చించగా... తక్షణమే అదనంగా రూ.1,200 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి: ts cabinet meeting: ఇవాళ మంత్రివర్గం భేటీ.. ఉద్యోగ భర్తీకి ఆమోద ముద్ర!

Last Updated : Jul 13, 2021, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.