ETV Bharat / state

కేబినెట్‌ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ! - హైదరాబాద్ లాక్​డౌన్ వార్తలు

రాష్ట్ర మంత్రి మండలి భేటీపై నేడు స్పష్టత రానుంది. హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్‌ మంగళవారం రోజంతా పలువురు మంత్రులు, నేతలు, సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే మంత్రిమండలి సమావేశానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

CM KCR
CM KCR
author img

By

Published : Jul 1, 2020, 5:47 AM IST

కరోనా నియంత్రణ కోసం రాజధానిలో లాక్‌డౌన్‌ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంపై బుధవారం స్పష్టత రానుంది. లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌ సహా ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రోజంతా పలువురు మంత్రులు, నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే మంత్రిమండలి సమావేశానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ గడువు మంగళవారంతో ముగిసింది. కేంద్రం కూడా అన్‌లాక్‌పై విధివిధానాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంది.

ఈ తీర్మానాలు చేయాల్సి ఉంది

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటుచేయాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన ఇతరత్రా నిర్ణయాలపైనా మంత్రిమండలిలో తీర్మానాలు చేయాల్సి ఉంది. వీటన్నింటి కోసమైనా కేబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది. ఈ విషయంలో బుధవారం సీఎం నిర్ణయం వెలువడే వీలుంది.

స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు..

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే రాష్ట్రంలోని పలు కాలనీల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు ముందుకొస్తున్నారు. కిరాణా దుకాణాలు, వ్యాపార సంస్థలు వేళలను కుదించేశాయి. కొన్నిచోట్ల వ్యాపారులు పూర్తి బంద్‌ పాటిస్తున్నారు.

గ్రామాలకు తరలుతున్న జనం

జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ ఉంటుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించడంతో ఆ ప్రచారం ఊపందుకుంది. లాక్‌డౌన్‌కు అందరినీ సిద్ధం చేయాలంటూ ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల కేసీఆర్‌ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారంతో ఇప్పటికే కొందరు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో టోల్‌గేట్ల దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.