ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ - cabinet meet

telangana-cabinet-meeting-in-pragathi-bhavan
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ
author img

By

Published : Nov 13, 2020, 4:00 PM IST

Updated : Nov 13, 2020, 4:40 PM IST

15:57 November 13

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన వారికి 10వేల సాయం, ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం, రహదారులు, నాలాల అభివృద్ధి, మరమ్మతులపై సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది.    

   సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ఎల్​ఆర్​ఎస్​ తదితరాలకు సంబంధించి కొన్ని చట్టసవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సన్నాలు పండించిన వారికి బోనస్ ఇస్తామని కొడకండ్ల సభలో సీఎం కేసీఆర్​ తెలిపారు. ఈ విషయమై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ అంశం మంత్రివర్గం ముందుకొచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

ఇవీ చూడండి: పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్

Last Updated : Nov 13, 2020, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.