ETV Bharat / state

రేపటి నుంచే బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం.. వాడీవేడిగా సాగనున్న చర్చలు..! - బడ్జెట్​ సమావేశంలో ప్రసంగించనున్న గవర్నర్​

Telangana Budget Meeting: రేపటి నుంచి ప్రారంభంకానున్న.. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తామని విపక్షాలు స్పష్టంచేస్తుండగా... ఎన్నిరోజులైనా ఏ అంశంపైనా చర్చించేందుకు సిద్ధమని అధికార పక్షం అంటోంది. రెండేళ్ల తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసగించనున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనుంది.

s
s
author img

By

Published : Feb 2, 2023, 9:24 PM IST

Updated : Feb 2, 2023, 10:58 PM IST

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్​ సమావేశాలు

Governor Tamilisai Will Address Budget Meeting Of Telangana: శుక్రవారం నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఆమోదం కోసం శాసనసభ, శాసనమండలి...శుక్రవారం నుంచి భేటీకానున్నాయి. ఉభయసభల సంయుక్త సమావేశంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తర్వాత బీఏసీలో చర్చించి శాసనసభ, మండలి సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. పాత సమావేశాలకు కొనసాగింపుగానే జరుగుతున్న సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహారావు నేతృత్వంలో శాసనసభ, మండలి సజావుగా సాగేలా అన్నిచర్యలు చేపట్టారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉండాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఈ బడ్జెట్‌లో నీళ్లు, నిధులు, నియామకాలకు.. అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, ధరణిలో లోపాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వ్యవసాయరంగం, రుణమాఫీ వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. బడ్జెట్‌ సమావేశాలు కనీసం 30 నుంచి 33 రోజులు జరగాలన్నారు. అప్పుడే ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించే అవకాశం ఉంటుందంటుని భట్టి విక్రమార్క సూచించారు. సభ పూర్తిగా సఫలం కావాలని ఆకాక్షించారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మహిళల వడ్డీ రుణాలు, అక్రమ కేసులు, నిరుద్యోగ యువత, రైతు సమస్యలు సహా.. పలు అంశాలపై బీఆర్​ఎస్​ సర్కార్‌ను నిలదీస్తామని ఈటల చెప్పారు. కేసీఆర్​ సర్కారు.. ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ అవినీతి, అక్రమాలపాలనలో యువత, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడవడం లేదు.. రాచరికపు పాలన నడుస్తోందన్నారు. పోలీస్​స్టేషన్​లలో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి, వారిని కొట్టిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాతో సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమ సంపాదన అర్జిస్తున్నారని ఈటల ఆరోపించారు. ధరణి పోర్టల్​తో ఈరోజు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని విమర్శించారు.

శాసనసభ, మండలి సమావేశాల నేపథ్యంలో భద్రతాపరంగా పోలీస్‌శాఖ లోపల, బయట భారీగా పోలీసులను మొహరించనుంది. ఇప్పటికే పోలీసు శాఖ ఇందుకు అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేసింది. సమావేశాల సందర్భంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉండడంతో.. అసెంబ్లీ లోనికి చొచ్చుకుని రాకుండా ఉండేందుకు ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 2, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.