లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్ -చైనా మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ సంతాపం తెలియజేశారు. జవాన్లు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించి దేశ సేవకోసం ప్రాణాలు త్యాగం చేశారని పేర్కొన్నారు.
వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరువమన్నారు. సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబుతోపాటు మరో అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించారు. సైనికుల సేవలను దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని తెలిపారు.