హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, పౌరసత్వ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై చర్చించనున్నారు. పౌరసత్వ బిల్లుపై అంశంపై అవగాహన నిమిత్తం రేపు భాజపా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే శాంతియుతంగా నిరసన తెలిపే విషయంపై చర్చిస్తున్నారు.
సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కృష్ణదాస్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీలు గరికపాటి మోహన్ రావు, బండి సంజయ్, నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి రాంచందర్ రావు, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి : పురపోరులో తెరాసదే విజయం: మంత్రి హరీశ్