సీఏఏకు మద్దతుగా మార్చి 15న ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహిస్తున్న సభపై ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశమై చర్చించింది. రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్ర రావు, కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నందున... సభ విజయవంతానికి ప్రణాళికలు రచించారు. సీఏఏపై తెరాస, ఎంఐఎం, ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నేతలంతా జిల్లాల్లో పర్యటించాలని లక్ష్మణ్ సూచించారు.
ఇదీ చూడండి: ట్రంప్‌తో దావత్ కోసం రేపు దిల్లీకి సీఎం కేసీఆర్