ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన బండి సంజయ్ - సీఎం కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 13 లక్షల మందిలో 25 శాతం రాష్ట్రానికి రావాలని చూస్తున్నారని తెలిపారు. వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని లేఖలో కోరారు.

telangana-bjp-chief-bandi-sanjay-letter-wrote-to-cm-kcr
సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన భాజపా రాష్ట్ర అధ్యక్షులు
author img

By

Published : Jul 2, 2020, 10:12 PM IST

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సీఎం కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణకు చెందిన 13 లక్షల మందిలో 25 శాతం వరకు స్వరాష్ట్రానికి తిరిగి రావాలని అనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే అధిక సంఖ్యలో కార్మికులు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ గల్ఫ్ బాట పట్టారని అన్నారు. లాక్​డౌన్ వల్ల ఎక్కువ మంది ప్రజలు ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా ఉందని ఫోన్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. వారి కుటుంబీకుల యోగక్షేమాలపై ఆందోళన చెందుతున్నారని అన్నారు.

గల్ఫ్​లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను ఆదుకుని వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన కార్మికులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే వారికి క్వారంటైన్ వసతి ఏర్పాట్లు చేస్తే వందే భారత్ మిషన్ ద్వారా కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అన్నీ అనుకూలిస్తే రోజుకి సుమారు 1500 మందిని హైదరాబాద్ విమానాశ్రయంకు తరలించవచ్చని కేసీఆర్​కు లేఖ ద్వారా వివరించారు.

ఇదీ చూడండి : మందుబాబుల హల్​చల్​.. స్థానికుల ఇబ్బందులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.