Telangana BC Commission: తమిళనాడులో తెలంగాణ బీసీ కమిషన్ బృందం మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో వారు సమావేశమయ్యారు. తమిళనాడు రాష్ట్రం చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలు తీరు తెన్నులను అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చినట్లు సీఎంకు తెలిపారు.
తాము చేయబోయే అధ్యయన వివరాలను ఆయన దృష్టికి తెచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిమాణాత్మకంగా రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ.. సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్దతులను ఇక్కడి అధికారుల ద్వారా సమగ్రంగా సేకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని స్టాలిన్‌ను కమిషన్ బృందం శాలువాతో సన్మానించి పలు పుస్తకాలను అందచేశారు.
అనంతరం తమిళనాడు బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ తనికాచలం, బీసీ, ఎంబీసీ, మైనారిటి శాఖల మంత్రి రాజకన్నప్పన్, ఇతర ఉన్నతాధికారులతో భేటీఅయ్యారు. అలాగే స్థానిక ద్రావిడ ఉద్యమ దిగ్గజం ప్రముఖ సంఘ సంస్కర్త ఇ.వి.పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కిషోర్‌గౌడ్‌లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..