Telangana BC 1 Lakh Scheme : రాష్ట్రంలోని బీసీ కులవృత్తులకు ఇటీవల రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. లక్షలాది మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి పలుచోట్ల ఇప్పటికే ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. జిల్లా స్థాయిలో అధికారులు రూపొందిస్తున్న అర్హుల జాబితాలపై స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో నెలన్నర అయినా అర్హుల ఎంపిక ప్రక్రియ సాగటం లేదు.
తాము చెప్పిన వారినే జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతుండటంతో జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమాధికారులు తలలు పట్టుకుంటున్నారు. జులై నుంచి ప్రతి నెల 15న ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే పంపిణీ ప్రక్రియ ప్రారంభం కూడా కాలేదు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం అవసరమైన నిధులు అందుబాటులో ఉంచినా.. అర్హుల జాబితా మాత్రం తేలడం లేదు.
BC Bandhu Scheme in Telangana : ఈ ఏడాది ఆరో నెలలో పథకానికి సంబంధించి 5.28 లక్షల కుటుంబాలు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని జూన్ 26లోగా పరిశీలించి, జులై 5 నాటికి వరుస క్రమంతో జాబితాలు సిద్ధం చేశారు. అదే నెల 15న ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి రూ.లక్ష సాయం అందించాలని నిర్ణయించారు. దాదాపు 4.2 లక్షల మంది అర్హులుగా తేలారని, ఆర్థిక సహాయం పంపిణీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Backward Classes Minister Gangula Kamalakar) శాసన మండలిలో తెలిపారు.
Telangana BC Rs 1 Lakh Scheme 2023 : బీసీలకు ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు : గంగుల
ప్రభుత్వం కూడా అదనంగా ఇచ్చిన రూ.400 కోట్ల నిధులతో పాటు అప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ.300 కోట్లు జిల్లా కలెక్టర్ల వద్ద అందుబాటులో పెట్టింది. అయితే జులై 15న చాలా జిల్లాల్లో చెక్కుల పంపిణీ చేయలేకపోయారు. కొన్ని జిల్లాల్లో ప్రారంభించినా 50-100 మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించే బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ(Backward Classes Welfare) తీసుకుంది.
Financial Condition of Artisan Families : చేతివృత్తుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి.. కులవృత్తిలో కొనసాగుతున్నారా.. వ్యవసాయ భూములు, కార్లు ఉన్నాయా.. గత ఐదేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా ఆర్థిక సహాయం లభించిందా..? తదితర వివరాలను సేకరించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. తాము చెప్పిన దరఖాస్తులనే పరిశీలన చేయించి జాబితాలను పంపించారు.
ఉన్నతాధికారులు సాఫ్ట్‌వేర్ సహాయంతో వాటిని ఫిల్టర్ చేయగా అనర్హులున్నట్లు వెల్లడైంది. తుది జాబితాలో స్థానిక ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన పేర్లు లేకుండా పోయాయి. దీంతో తాము సూచించిన వారిని ఎందుకు తొలగించారని.. తిరిగి చేర్చాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏం చేయాలో తోచని అధికారులు పరిశీలన ఇంకా కొనసాగుతోందని దరఖాస్తుదారులకు చెబుతున్నారు.
MLA's Recommendations in Minorities 1 lakh Scheme : మైనార్టీ కార్పొరేషన్ పరిధిలోనూ రూ.లక్ష సహాయం పంపిణీని ఈ నెల 19న ప్రారంభిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనార్టీలు స్వయం ఉపాధి రుణాల కోసం చేసిన దరఖాస్తులను పరిశీలిస్తామని పేర్కొంది. తొలి విడత కింద దాదాపు 10 వేల మందికి ఆర్థిక సహాయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిలోనూ ఎమ్మెల్యేల సిఫార్సులు కీలకంగా మారుతున్నాయి. క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ దరఖాస్తుల స్వీకరణ ఇంకా ముగియలేదు.
Telangana BCs Rs 1 Lakh Scheme : నేటితో గడువు ముగిసింది.. ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రం అందలేదు.. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది.
Harish Rao Distributes BC Bandhu Cheques : బీసీ కులాలను ఆర్థికంగా ఆదుకుంటాం: హరీశ్ రావు