ETV Bharat / state

Telangana Assembly on Floods Damage : అసెంబ్లీని కుదిపేసిన 'వరద'.. పరిహారం ప్రకటించాలని విపక్షాల పట్టు.. సీఎం లేరని కాంగ్రెస్ వాకౌట్ - Telangana Assembly today news

Telangana Assembly on Floods Damage : ఆకస్మిక వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తినా సకాలంలో యంత్రాంగం స్పందించడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందని ప్రభుత్వం స్పష్టంచేసింది. సహాయక చర్యలు అద్భుతంగా సాగాయన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి.. సీఎం ముందుచూపుతో నష్టం తీవ్రత తగ్గించామని శాసనసభలో వెల్లడించారు. వరద విపత్తును ఎదుర్కొవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్న విపక్ష సభ్యుల వాదనను తోసిపుచ్చారు. బాధితులందర్నీ ఆదుకునే ప్రణాళికలు సాగుతున్నాయని.. పంట నష్టం నివేదిక రాగానే త్వరలోనే ముంపు రైతులందరికీ పరిహారం అందిస్తామని శాసనసభ వేదికగా ప్రకటించారు.

Telangana Assembly Debate On Flood Damage
Telangana Assembly Sessions 2023
author img

By

Published : Aug 4, 2023, 7:42 PM IST

Updated : Aug 5, 2023, 6:40 AM IST

Telangana Assembly on Floods Damage : అసెంబ్లీని కుదిపేసిన వరద నష్టతీవ్రత.. సభలో పరిహారం ప్రకటించాలని విపక్షాల పట్టు

Flood Damage Statement On Telangana Assembly : ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదల అంశం శాసనసభను కుదిపేసింది. వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ వాడీవేడీగా సాగింది. తొలుత చర్చను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. విపత్తుతో అల్లాడిపోతున్న భూపాలపల్లి జిల్లాను ఆదుకోవాలని కోరారు. జంపన్నవాగు ఉద్ధృతికి వేలాది మంది నిరాశ్రయులయ్యారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తావించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా ఏం ఇస్తారనేది శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

Prashanth Reddy on Crop Compensation : 'పంట నష్టం నివేదిక రాగానే.. ముంపు రైతులందరికీ పరిహారం అందిస్తాం'

Telangana Assembly Debate On Flood Damage : భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లినందున శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం రూ.6 వేల 226 కోట్లు నిధులు అవసరమని అని మజ్లిస్‌ సభాపక్షనేత అక్బరుద్దీన్ వెల్లడించారు. యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేశారన్న ఆయన.. మిగిలిన మొత్తం ఎప్పుడు విడుదల చేస్తారో వివరణ ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టులు నిండినందున.. రానున్న రోజుల్లో భారీ వర్షాలు వస్తే ఎలా ఎదుర్కొంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

"ములుగు నియోజకవర్గంలో 15మంది చనిపోయారు. కట్టుబట్టలతో అందరూ మిగిలిపోయారు. జంపన్న వాగు ఉద్ధృతికి మా ప్రాంతం అతలకుతలమై పోయింది. ఇంత వరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే పరిహారం ప్రకటించాలి. దయచేసి మా ములుగు ప్రజలను ఆదుకోవాలి."- సీతక్క, ములుగు ఎమ్మెల్యే

Raj Bhavan on TSRTC Bill : కాస్త టైం కావాలి.. TSRTC బిల్లుపై రాజ్​భవన్ కామెంట్స్

వరదల్లో పంటను నష్టపోయిన రైతులకు పదివేల చొప్పున తక్షణ పరిహారం, ఇళ్లు సహా సర్వం కోల్పొయిన వారికి 50 వేలు పరిహారం అందించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. కడెం ప్రాజెక్టును తెగిపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. వరద విపత్తు నివారణలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించిందన్న విపక్ష సభ్యుల వాదనను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తోసిపుచ్చారు. ఊహించని ప్రకృతి విపత్తును సీఎం నిరంతర పర్యవేక్షణలో యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని వివరించారు. బాధితులందరినీ ఆదుకుంటామని నష్టం నివేదిక రాగానే పంట పరిహారం అందిస్తామన్నారు.

మృతుల కుటుంబాలకు 4 లక్షల తక్షణ సాయంతో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే ముంపు సమస్య తలెత్తిందన్న కాంగ్రెస్‌ వాదనను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తప్పుపట్టారు. వరద పరిహారంపై ప్రకటన చేయకపోవడం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానంపై అసంతృప్తితో కాంగ్రెస్‌ సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు.

"వరదల్లో 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాం. 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించాం.139 గ్రామాల్లో వరదల నష్టం ఎక్కువ జరిగింది. సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గింది. ఆపత్కాలంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా చాలా కృషి చేశారు. మిషన్‌ కాకతీయ వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. మిషన్‌ భగీరథ సిబ్బంది కూడా చాలా వేగంగా నీటి సరఫరాను పునరుద్ధరించారు". ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు భవనాలశాఖ మంత్రి

Minister Koppula on Gurukul Schools :' గురుకుల విద్యార్థులు.. IIT, JEE, NEETలలో సత్తా చాటుతున్నారు'

Niranjan Reddy on Telangana Crop Loss : 'త్వరలోనే రాష్ట్రంలో.. ప్రత్యేక పంట బీమా పథకం'

HC hearing on Telangana floods : 'వరదల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు ఏం చేశారు..? భూపాలపల్లి జిల్లాలో మృతుల వివరాలు తెలపాలి'

Last Updated : Aug 5, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.