ETV Bharat / state

లైవ్​ అప్​డేట్స్​: బడ్జెట్​ సమావేశాలు - లైవ్​: ఉభయసభల్లో బడ్జెట్​ సమావేశాలు

లైవ్​: అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశాలు
author img

By

Published : Sep 9, 2019, 11:28 AM IST

Updated : Sep 9, 2019, 12:55 PM IST

12:40 September 09

బడ్జెట్​ హైలైట్స్

రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం అంచనా

రూ.1,46,492.3 కోట్లు

రెవెన్యూ వ్యయం

రూ.1,11,055 కోట్లు

మూలధన వ్యయం

రూ.17,274.67 కోట్లు

బడ్జెట్ అంచనాల్లో మిగులు

రూ.2,044.08 కోట్లు

ఆర్థిక లోటు    

రూ.24,081.74 కోట్లు

బడ్జెట్​లో కేటాయింపులు

రైతుబంధు

రూ.12 వేల కోట్లు

రైతు రుణమాఫీ    

రూ.6 వేల కోట్లు

రైతుబీమా

 రూ.1,137 కోట్లు

విద్యుత్ రాయితీ

రూ.8 వేల కోట్లు

ఆసరా పింఛన్లు    

రూ.9,402 కోట్లు

గ్రామపంచాయతీ

రూ.2,714 కోట్లు

పురపాలక సంఘాలు    

రూ.1,764 కోట్లు

12:39 September 09

సామాజిక ఆర్థిక నివేదిక 2019ని ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.

12:38 September 09

అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. శాసనసభ ఈ నెల 14కు వాయిదా పడింది. శాసనమండలి ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.

12:23 September 09

అసెంబ్లీలో కేసీఆర్​ ప్రసంగం:

  • గడచిన ఏడాదిన్నరగా దేశంలో తీవ్ర ఆర్థికమాంద్యం
  • 2018-19లో దేశంలో 8 నుంచి 5.8 శాతానికి తగ్గిన జీడీపీ వృద్ధి రేటు
  • 2018-19 మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 8 శాతం నమోదు
  • 2018-19 రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 7 శాతం నమోదు
  • 2018-19 మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 6.6 శాతం నమోదు
  • 2018-19 చివరి త్రైమాసికంలో దేశ జీడీపీ 5.5 శాతం నమోదు
  • ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ మరింత దిగజారి 5 శాతం వృద్ధి నమోదు
  • దేశంలో ఆర్థికమాంద్యం స్థిరంగా కొనసాగుతోంది
  • ఆర్థికమాంద్యం పరిణామాలను నిత్యం గమనిస్తున్నాం
  • ఆర్థికమాంద్యం వల్ల దేశంలోని ముఖ్యమైన విభాగాలు తిరోగమన దిశలో ఉన్నాయి
  • సియామ్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది
  • సియామ్ సర్వే ప్రకారం వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి
  • ఆటోమొబైల్ రంగంలో 3.5 లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం విషమ పరిస్థితికి అద్దం పడుతుంది

12:13 September 09

అసెంబ్లీలో కేసీఆర్​ ప్రసంగం:

  • రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయింపు
  • రైతు రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయింపు
  • రైతుబీమాకు రూ.1,137 కోట్లు కేటాయింపు
  • విద్యుత్ రాయితీల కోసం రూ.8 వేల కోట్లు కేటాయింపు
  • ఆసరా పింఛన్లకు రూ.9,402 కోట్లు కేటాయింపు
  • ఐదేళ్లలో కేంద్రపథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.31,802 కోట్లు
  • ఐదేళ్లలో రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2,72,926 కోట్లు

12:07 September 09

అసెంబ్లీలో కేసీఆర్​ ప్రసంగం:

  • ఉద్యోగ అవకాశాలు స్థానికులకే కల్పించాలని కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చాం
  • స్థానిక ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా చట్టం చేశాం
  • కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు
  • జిల్లాలను 33, రెవెన్యూ డివిజన్లను 69, మండలాలను 584కు పెంచాం
  • పురపాలక సంఘాలను 142కి పెంచాం
  • కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటిసంఖ్య 13కి పెంచాం
  • గ్రామపంచాయతీలను 12,751కి పెంచాం
  • జిల్లా పంచాయతీ కార్యాలయాల సంఖ్యను 32కి పెంచాం
  • ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 68 బీఎల్‌వో పోస్టులు పెంచాం
  • ఈవో పీఆర్‌డీ పోస్టులను 539కి పెంచాం
  • ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగు
  • ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250 కోట్ల విలువైన వైద్యసేవలే అందుతాయి

12:01 September 09

అసెంబ్లీలో కేసీఆర్​ ప్రసంగం:

  • కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు
  • గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ
  • గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర గ్రామీణ, పట్టణ విధానం
  • కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాల అమలు
  • కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశాం
  • ప్రజలు, రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త రెవెన్యూ చట్టం
  • అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించేలా రెవెన్యూ చట్టం
  • పరిపాలనా వ్యవహారాల బాధ్యతలపై స్పష్టమైన నియమ, నిబంధనలు
  • స్థానికసంస్థల అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతలపై స్పష్టత ఇచ్చాం
  • విధినిర్వహణలో విఫలమైతే బాధ్యతల నుంచి తొలగిస్తాం

  • శాంతిభద్రతలు మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు పోలీసు వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాం
  • పోలీసు కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచాం
  • పోలీసు సబ్‌డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం
  • పోలీసు సర్కిళ్ల సంఖ్యను 717కి పెంచాం
  • పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం

11:58 September 09

అసెంబ్లీలో కేసీఆర్​ ప్రసంగం:

  • రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం
  • 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి
  • తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిరేటులో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిచింది
  • పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి ఖాళీల భర్తీ
  • స్థానికసంస్థలకు నిధుల కొరత రానీయకుండా కట్టుదిట్టమైన విధానం
  • గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు
  • గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు అందించాలని నిర్ణయం
  • పంచాయతీలకు సెప్టెంబరులో ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికే విడుదల చేశాం
  • గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు కేటాయింపు
  • పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు కేటాయింపు

11:50 September 09

రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు

మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు

బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లు

ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు

ఆర్థికమాంద్యం వల్ల ఆదాయం తగ్గినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో వివరించారు. ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. బకాయిల చెల్లింపునకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయమని అన్నారు. పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధుల ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

11:40 September 09

కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభమయిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ సగర్వంగా నిలిచిందని వెల్లడించారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు మూలధనవ్యయ వాటా తక్కువ ఉండేదని అన్నారు. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052 కోట్లు ఉండగా... గడిచిన ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.1,65,165 కోట్లు ఉందని తెలిపారు. ఆర్థికవృద్ధి రేటు 21.49 శాతం, 24 గంటల విద్యుత్‌ వల్ల వ్యవసాయ, పారిశ్రామిక పురోభివృద్ధి సాధ్యమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించామని... వ్యవసాయ రంగంలో అదనపు వృద్ధి సాధించినట్లు అసెంబ్లీలో  వివరించారు.

11:35 September 09

ఉభయసభల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ పూర్తిస్థాయిలో పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో బడ్జెట్​ను సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టనుండగా... మండలిలో ఆర్థికమంత్రి హరీశ్​రావు పద్దును ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.
 
09:03 September 09

లైవ్​ అప్​డేట్స్​: బడ్జెట్​ సమావేశాలు

కాళోజీ జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లోని కాళోజీ చిత్రపటానికి సభాపతి పోచారం, ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. 

Last Updated : Sep 9, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.