ETV Bharat / state

పోలింగ్​కు సర్వం సిద్ధం - అల్లర్లు జరగకుండా ఐదంచెల భద్రత - ఓటింగ్​ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ - తెలంగాణలో పోలింగ్‌కు ఏర్పాట్లు

Telangana Assembly Elections Polling Arrangements 2023 : శాసనసభ ఎన్నికల కోసం మహానగర పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా బూత్‌ స్థాయి నుంచి సూక్ష్మ ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల కోసం మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు 70 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Police Arrangements For Poling
ఎన్నికల కోసం సిద్ధంమైన హైదరాబాద్​ పోలీసులు, కేంద్ర బలగాలు
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 7:50 AM IST

Telangana Assembly Elections Polling Arrangements 2023 : రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు(Assemble Elections) పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ బూత్, రూట్‌ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్​తో పాటు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేశారు. స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్, రిజర్వు ఫోర్స్‌, ఏఆర్, ఎస్పీఎఫ్‌కు చెందిన అదనపు యూనిట్లు కలిసి దాదాపు 30 వేల మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారు. ఇప్పటికే సిబ్బంది కేటాయింపు.. అధికారులకు శిక్షణ పూర్తయ్యాయి. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయి.

Tight Security in Telangana Elections 2023 : గత ఎన్నికల్లో ఘర్షణలు జరగడం, ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్న ఘటనలు, తాజా శాంతి భద్రతల ఆధారంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్ని గుర్తిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని సుమారు వెయ్యి వరకూ ఇలాంటి కేంద్రాలును గుర్తించారు. మిగతాచోట్ల సాధారణ పోలీసులు గస్తీలో ఉంటారు.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

Security Arrangements in Telangana Elections 2023 : హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలింగ్‌ రోజు 391 రూట్‌ మొబైల్స్‌, 129 పెట్రోలింగ్‌ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు గస్తీలో పాల్గొంటాయి. 9 టాస్క్‌ఫోర్స్‌, 9 స్పెషల్‌ ఫోర్స్ బృందాలు, 71 మంది ఇన్‌స్పెక్టర్లు, 125 మంది ఎస్సైల్ని సత్వర స్పందన బృందాలుగా విభజించి వేర్వేరు ప్రాంతాల్లో గస్తీలో ఉంచారు. అదనంగా 45 ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లతో, ముఖ్య ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.

పోలింగ్‌ రోజు ఒకవేళ అల్లర్లు, ఘర్షణ జరిగినట్లయితే నిమిషాల వ్యవధిలో స్పందించేందుకు వీలుగా రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో దశలవారీ భద్రతా విధానం అమలుచేస్తున్నారు. తొలిదశలో పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఉండే భద్రతా సిబ్బంది.. ఒకటి, రెండు నిమిషాల్లో స్పందిస్తారు. రెండోదశలో రూట్‌మొబైల్‌ నిరంతరం గస్తీలో ఉండి.. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్ని సందర్శిస్తుంటారు.

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణపై పోలీసుల ఫోకస్.. వారే టార్గెట్!

మూడోదశలో ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఉంటుంది. నాలుగోదశలో ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్ ఉంటుంది. ఐదో దశలో డీసీపీ ఆధ్వర్యంలో రిజర్వు ఫోర్సు ఉంటుంది. పరిస్థితిని బట్టి క్షణాల్లో చేరుకునేలా బలగాలను సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో సీసీ కెమెరాలతో పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల దగ్గర అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడకుండా ఆదేశాలిచ్చారు.

Supreme Court lawyers on TS Elections : శాసనసభ ఎన్నికల నిర్వహణపై సీఈసీకి.. సుప్రీం న్యాయవాదుల విజ్ఞాపనలు

ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.