ETV Bharat / state

అమూల్యమైన ఓటు వేసేముందు ఎన్నో సందేహాలు - ఇదిగో వాటికి సమాధానాలు - తెలంగాణ ఎన్నికల 2023లో ఓటరు అవగాహన

Telangana Assembly Elections Polling 2023 : ఓటు ద్వారా మెరుగైనా ప్రజాస్వామ్యానికి బాటలు వేయవచ్చు. అందుకే ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవటానికి ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరీ ఓటు వేసే ముందు కొందరికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. వాటికి సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana Assembly Elections 2023
Voter Awareness in Telangana Election 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 11:33 AM IST

Telangana Assembly Elections Polling 2023 : ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం. ఇందులో అక్షరాలు రెండే అయినా.. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. మెరుగైన పాలనకు బాటలు వేసి.. పౌరుల బంగారు భవితను నిర్దేశిస్తుంది. మరీ పోలింగ్ రోజు నీకు ఉన్న హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కానీ రోజున బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే ఓటు వేసే (Vote) ముందు కొందరికి ఎన్నో సందేహాలు.. వాటికి సమాధానాలివిగో..!

ఓటరు జాబితాలో పేరు లేకుంటే.. ఓటేయలేనా? : ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. అందులో పేరు లేకుంటే ఓటు వేయడం సాధ్యం కాదు. అలాంటి వారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక.. కొత్తగా ఓటుకోసం ఫారమ్‌ 6కు దరఖాస్తు చేసుకోవాలి.

ఓటు వచ్చింది. కార్డు రాలేదు. ఓటు వేయవచ్చా? : మీకు ఓటు హక్కు వస్తే.. ఆన్‌లైన్‌లో ఓటరు ఫొటో గుర్తింపుకార్డు (ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈసీ నిర్ధారించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ-ఎపిక్‌ కార్డును ఓటు వేసేందుకు ధ్రువీకరణ పత్రంగా ఎన్నికల సంఘం ఆమోదం తెలపలేదు. ఈసీ (Election Commission) వెబ్‌సైట్‌లో మీ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

అమ్మానాన్నలకు 80 ఏళ్లు దాటాయి. ఇంటికి వచ్చి వారితో ఓట్లు వేయించుకొని వెళతారా? : ఆ గడువు ఇప్పటికే ముగిసింది. తెలంగాణలో ముందస్తుగా సుమారు 27,000ల మంది వయోవృద్ధులు ఈ ఎన్నికల్లో దరఖాస్తు చేసుకున్నారు. వారు ఇంటి వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేసుకోని వారు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే.

ఓటు వేయడానికి ఏమీ తీసుకెళ్లాలి? : ఓటరు కార్డు లేకపోతే పాస్‌పోర్ట్‌, ఫొటోతో ఉన్న బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, ఎన్‌పీఆర్‌ కింద ఆర్బీఐ జారీ చేసిన గుర్తింపు కార్డు.. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పింఛను పత్రం, వీటిలో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు.

ఓటుందో లేదో ఎలా తెలుసుకోవాలి? : https://electoralsearch.eci.gov.in/ లేదా https://eci.gov.in లేదా ceotelangana.nic.in లేదా voterhelplineApp వీటిలో ఏదోఒక దాని ద్వారా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. అలాగే పోలింగ్‌ బూత్‌లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.

ఎన్నికల వేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? : పోలింగ్ సమయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే .. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 100 నంబరుకు, ఈసీ ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి చెప్పవచ్చు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.

ఓటు హక్కు వినియోగంపై యువత ఏమంటోంది?

గత ఎన్నికల్లో వెళ్లేసరికే ఎవరో నా ఓటు వేశారు. ఈసారీ అలా జరిగితే ఏం చేయాలి? : ఒకవేళ అలాంటప్పుడు.. పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఛాలెంజ్‌ ఓటు కోరవచ్చు. అధికారులు దీనిని నిర్ధారించుకుని.. బ్యాలెట్‌ పత్రం ద్వారా ఓటు వేసేందుకు అవకాశాన్ని ఇస్తారు. ఆ ఓటును ప్రత్యేకంగా నమోదు చేసి.. ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత విచారణ జరుపుతారు.

గుర్తింపు కార్డు లేకుంటే ఓటు వేయనివ్వరా? : ఈసీ నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. లేకుంటే ఓటు వేసేందుకు అనుమతించరు.

ఊరిలో ఓటు ఉంది. హైదరాబాద్‌లోనూ ఉంది. ఉదయం హైదరాబాద్‌లో వేసి.. సాయంత్రం లోపు ఊరికి వెళ్లి అక్కడ వేయవచ్చా? అంగీకరిస్తారా? : ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒకటికి మించి ఓటు ఉండటం నేరం. ఒకవేళ పొరపాటున ఓటు ఉన్నా.. ఒకటికి మించి ఓటు వేయడమూ నేరం. ఒక్క ప్రాంతంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఓటు వేసినట్లు ఏదైనా రసీదు ఇస్తారా? : ఓటు వేసినప్పుడు రసీదు ఇచ్చే అవకాశం లేదు. ఓటు వేసినట్లు చూపుడు వేలిపై.. పోలింగ్ సిబ్బంది వెంటనే చెరిగిపోని ఇంకుతో వేసే గుర్తే ప్రామాణికమని చెప్పవచ్చు.

రాష్ట్రంలో మొదటిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం విజయవంతం

ఓటరు స్లిప్పులు అందలేదు. ఓటరు కార్డులను తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లవచ్చా? : ఓటర్ల జాబితాలో పేరు ఉండటమే ప్రామాణికంగా చెప్పవచ్చు. ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. మీరు చూపించే గుర్తింపు కార్డులో ఫొటోను, ఓటరు కార్డులోని ఫొటోను అధికారులు సరిపోల్చుకుంటారు.

పొరపాటున ఈవీఎంలో ఒకే గుర్తుపై రెండుసార్లు నొక్కితే ఓటు పడుతుందా? : మొదటిసారి నొక్కిన గుర్తుపైనే ఓటు పడుతుంది. రెండోసారి బటన్‌ నొక్కినా పనిచేయదు. బ్యాలెట్‌ యూనిట్‌ ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది.

ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్​ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.